(॥పల్లవి॥)
ఓవరి లోనిది వొకమనసు
భావము దెలిపీఁ బదఁ గదవయ్యా
(॥ఓవ॥)
కందువ నీతో గక్కునఁ జెప్పినఁ
చందము దెలిపీ జవరాలు
చిందినవ్వుల సిగ్గులతోనే
విందులు చెప్పీ విచ్చేయవయ్యా
(॥ఓవ॥)
మచ్చిక నీపై మలయుచుఁ జల్లినఁ
మచ్చులు దెలిపీ మదిరాక్షి
రచ్చల కెక్కిన రాజసముననే
విచ్చీ వలపులు విచ్చేయవయ్యా
(॥ఓవ॥)
తనువులు సోఁకఁగ తలఁపులు గరఁగినఁ
అనువులు దెలిపీ నలివేణి
యెనసితి శ్రీ వేంకటేశ యీసతిని
వెనుకొని పొత్తుకు విచ్చేయవయ్యా
(||pallavi||)
ovari lonidi vŏgamanasu
bhāvamu dĕlibīm̐ badam̐ gadavayyā
(||ova||)
kaṁduva nīdo gakkunam̐ jĕppinam̐
saṁdamu dĕlibī javarālu
siṁdinavvula sigguladone
viṁdulu sĕppī vichcheyavayyā
(||ova||)
machchiga nībai malayusum̐ jallinam̐
machchulu dĕlibī madirākṣhi
rachchala kĕkkina rājasamunane
vichchī valabulu vichcheyavayyā
(||ova||)
tanuvulu som̐kam̐ga talam̐pulu garam̐ginam̐
anuvulu dĕlibī naliveṇi
yĕnasidi śhrī veṁkaḍeśha yīsadini
vĕnugŏni pŏttugu vichcheyavayyā