ఒట్టులేల తిట్టులేల వున్నదిగా నీమేలు
(॥పల్లవి॥)
ఒట్టులేల తిట్టులేల వున్నదిగా నీమేలు
దట్టిమైన నామనసు తనిసే నిఁక
(॥ఒట్టు॥)
వింటిఁగా నీమాటలు వీనులెల్లాఁ జల్లఁగాను
అంటి నీతో సరసములాడే నిఁక
కంటిఁగా నీగుణము కన్నులపండుగగాను
నంటున నీమాటలెల్లా నమ్మే నేనిఁక
(॥ఒట్టు॥)
తెలిసెఁగా నీచేఁత తేటతెల్లమిగాను
నలుగడ నిచ్చకమే నడుపే నిఁక
నిలిచెఁగా నీవలపు నిదులై నామేననేల్లా
నలువంక నీతో నే నవ్వే నిఁక
(॥ఒట్టు॥)
చిక్కెఁగా నీమేనెల్ల చేరి నాకాఁగిటి లోన
ముక్కుమోము వంచి నీకు మొక్కే నిఁక
యిక్కువ శ్రీ వేంకటేశ యిటు నిన్నుఁ గూడితిఁగా
వొక్కటై నీవురముపై నుండే నిఁక
(||pallavi||)
ŏṭṭulela tiṭṭulela vunnadigā nīmelu
daṭṭimaina nāmanasu tanise nim̐ka
(||ŏṭṭu||)
viṁṭim̐gā nīmāḍalu vīnulĕllām̐ jallam̐gānu
aṁṭi nīdo sarasamulāḍe nim̐ka
kaṁṭim̐gā nīguṇamu kannulabaṁḍugagānu
naṁṭuna nīmāḍalĕllā namme nenim̐ka
(||ŏṭṭu||)
tĕlisĕm̐gā nīsem̐ta teḍadĕllamigānu
nalugaḍa nichchagame naḍube nim̐ka
nilisĕm̐gā nīvalabu nidulai nāmenanellā
naluvaṁka nīdo ne navve nim̐ka
(||ŏṭṭu||)
sikkĕm̐gā nīmenĕlla seri nāgām̐giḍi lona
mukkumomu vaṁchi nīgu mŏkke nim̐ka
yikkuva śhrī veṁkaḍeśha yiḍu ninnum̐ gūḍidim̐gā
vŏkkaḍai nīvuramubai nuṁḍe nim̐ka