Otti neevu daggaride noddanadu sadi ninnu

ఒత్తి నీవు దగ్గరితే నొద్దనదు సతి నిన్ను
Language

(॥పల్లవి॥)
ఒత్తి నీవు దగ్గరితే నొద్దనదు సతి నిన్ను
చిత్త మెరఁగక గుట్టు సేసీఁ గాని

(॥ఒత్తి॥)
నిలువెల్లఁ బులకలే నిన్నుఁ జూచేప్పటనుండి
కలికి పయ్యద నట్టె కప్పీఁ గాని
తలఁ పెల్లఁ దమకమే తనకు నీ విటుపై పైఁ
బిలువఁగా నూరకె బిగిసీఁ గాని

(॥ఒత్తి॥)
వెలియల్ల చింతలే మినుకలి నాటనుండి
తల వంచి నీకుఁ గొంత దాఁచీఁ గాని
పలు కెల్ల దైన్యమే పడఁతి నియ్యెడకు
చలి వేఁడి రాజసాలు జరపీఁ గాని

(॥ఒత్తి॥)
వయ సెల్ల వలపులే వనిత నిన్నటనుండి
నయము సేసుక నీతో నవ్వీఁ గాని
క్రియ యెరిఁగి కూడితి కెలన శ్రీవెంకటేశ
జయ మందెఁ జెలి నీతో సరసము గాని

(||pallavi||)
ŏtti nīvu daggaride nŏddanadu sadi ninnu
sitta mĕram̐gaga guṭṭu sesīm̐ gāni

(||ŏtti||)
niluvĕllam̐ bulagale ninnum̐ jūseppaḍanuṁḍi
kaligi payyada naṭṭĕ kappīm̐ gāni
talam̐ pĕllam̐ damagame tanagu nī viḍubai paim̐
biluvam̐gā nūragĕ bigisīm̐ gāni

(||ŏtti||)
vĕliyalla siṁtale minugali nāḍanuṁḍi
tala vaṁchi nīgum̐ gŏṁta dām̐sīm̐ gāni
palu kĕlla dainyame paḍam̐ti niyyĕḍagu
sali vem̐ḍi rājasālu jarabīm̐ gāni

(||ŏtti||)
vaya sĕlla valabule vanida ninnaḍanuṁḍi
nayamu sesuga nīdo navvīm̐ gāni
kriya yĕrim̐gi kūḍidi kĕlana śhrīvĕṁkaḍeśha
jaya maṁdĕm̐ jĕli nīdo sarasamu gāni