Osi pobo neegu neme vumdambattadaa

ఓసి పోపో నీకు నేమె వుండఁబట్టదా
Language

(॥పల్లవి॥)
ఓసి పోపో నీకు నేమె వుండఁబట్టదా
వాసులు రేసు లెక్కించి వాదుకు వచ్చేవా

(॥ఓసి పోపో॥)
నిరతి నామీఁదట నీ కోప మెంత గల్ల
సొరిది యాతనిమీఁదఁ జూపవే పోయి
మరిగినవారితోడ మాటలాడఁ బాసెనా
వరుస నిల్లురి కేల వాదుకు వచ్చేవే

(॥ఓసి పోపో॥)
సారె సారె న న్నెంత సాదించఁ గలిగినాను
మేర మీరి నీ వాతనిమీఁద వెళ్లించు
కూరిమి గలుచుచోటఁ గూడినదె నేరమా
వారి వీరి మాట కేల వాదుకు వచ్చేవే

(॥ఓసి పోపో॥)
మలసి నామీఁదట మచ్చర మెంత గల్లాను
నెలవుగా నతనిపై నెరపఁగదే
యెలమి శ్రీవెంకటేశుఁ డింతలోనె నన్నుఁ గూడె
వలవనిజోలి నేల వాదుకు వచ్చేవే

(||pallavi||)
osi pobo nīgu nemĕ vuṁḍam̐baṭṭadā
vāsulu resu lĕkkiṁchi vādugu vachchevā

(||osi pobo||)
niradi nāmīm̐daḍa nī koba mĕṁta galla
sŏridi yādanimīm̐dam̐ jūbave poyi
mariginavāridoḍa māḍalāḍam̐ bāsĕnā
varusa nilluri kela vādugu vachcheve

(||osi pobo||)
sārĕ sārĕ na nnĕṁta sādiṁcham̐ galiginānu
mera mīri nī vādanimīm̐da vĕḽliṁchu
kūrimi galususoḍam̐ gūḍinadĕ neramā
vāri vīri māḍa kela vādugu vachcheve

(||osi pobo||)
malasi nāmīm̐daḍa machchara mĕṁta gallānu
nĕlavugā nadanibai nĕrabam̐gade
yĕlami śhrīvĕṁkaḍeśhum̐ ḍiṁtalonĕ nannum̐ gūḍĕ
valavanijoli nela vādugu vachcheve