Oruvamgadave vogayimchuga vadi

ఓరువఁగదవే వొకయించుక వడి
Language

(॥పల్లవి॥)
ఓరువఁగదవే వొకయించుక వడి
నీ రమణుఁడు మన్నించీ నిపుడు

(॥ఓరు॥)
వెన్నెలలే పో వేసవి యెండలు
వున్నతి భువి విరహులకెల్లా
పన్నీరే వెంబాల వెల్లువలు
కన్నులెదుట నివి కాలమహిమలు

(॥ఓరు॥)
వడిఁ జిగురులెపో వజ్రాయుధములు
బడివాసినదంపతులకును
సుడిగొనుపుప్పొడి చొక్కుమందు లివి
కడకమెరసె నివె కాలమహిమలు

(॥ఓరు॥)
మొనసిన విరులే పో. మోహనాస్త్రములు
చనవున నలిగిన జాణలకు
యెనసితి శ్రీవేంకటేశ నలమేల్మంగ
కనుఁగొన నింపాయ కాలమహిమలు

(||pallavi||)
oruvam̐gadave vŏgayiṁchuga vaḍi
nī ramaṇum̐ḍu manniṁchī nibuḍu

(||oru||)
vĕnnĕlale po vesavi yĕṁḍalu
vunnadi bhuvi virahulagĕllā
pannīre vĕṁbāla vĕlluvalu
kannulĕduḍa nivi kālamahimalu

(||oru||)
vaḍim̐ jigurulĕbo vajrāyudhamulu
baḍivāsinadaṁpadulagunu
suḍigŏnubuppŏḍi sŏkkumaṁdu livi
kaḍagamĕrasĕ nivĕ kālamahimalu

(||oru||)
mŏnasina virule po. mohanāstramulu
sanavuna naligina jāṇalagu
yĕnasidi śhrīveṁkaḍeśha nalamelmaṁga
kanum̐gŏna niṁpāya kālamahimalu