Orusugove yettayinaa vuvida neevu

ఓరుచుకోవే యెట్టయినా వువిద నీవు
Language

(॥పల్లవి॥)
ఓరుచుకోవే యెట్టయినా వువిద నీవు
నేరుపరి నీ విభుఁడు నేఁడే వచ్చీనీడకు

(॥ఓరు॥)
కలువల వేసితేలే కాముఁడు చుట్టము గాఁడా
వెలయు విరహులకు వెగటుగాక
చలివెన్నెల గాసితే చందురుఁడు పగవాఁడా
పొలయలుకలవారే పొగడరుగాక

(॥ఓరు॥)
కొసరుచుఁ బాడితేనే కోయిలగుండెబెదరా
అసు(స?) దు విరహులు కాదందురుగాక
ముసరితేఁ దుమ్మిదమూఁకలు దయలేనివా
విసిగిన కాముకులే వినలేరుగాక

(॥ఓరు॥)
వనము సింగారించితే వసంతుఁడు క్రూరుఁడా
వొనరని విరహులకొంటదుగాక
యెనసి శ్రీ వెంకటేశుఁడేలె నిన్ను చిలుకలు
కినిసేవా పాంథులకు కేరడముగాక

(||pallavi||)
orusugove yĕṭṭayinā vuvida nīvu
nerubari nī vibhum̐ḍu nem̐ḍe vachchīnīḍagu

(||oru||)
kaluvala vesidele kāmum̐ḍu suṭṭamu gām̐ḍā
vĕlayu virahulagu vĕgaḍugāga
salivĕnnĕla gāside saṁdurum̐ḍu pagavām̐ḍā
pŏlayalugalavāre pŏgaḍarugāga

(||oru||)
kŏsarusum̐ bāḍidene koyilaguṁḍĕbĕdarā
asu(sa?) du virahulu kādaṁdurugāga
musaridem̐ dummidamūm̐kalu dayalenivā
visigina kāmugule vinalerugāga

(||oru||)
vanamu siṁgāriṁchide vasaṁtum̐ḍu krūrum̐ḍā
vŏnarani virahulagŏṁṭadugāga
yĕnasi śhrī vĕṁkaḍeśhum̐ḍelĕ ninnu silugalu
kinisevā pāṁthulagu keraḍamugāga