ఓరుచుక యింటిలోన నుండనేరాదా
(॥పల్లవి॥)
ఓరుచుక యింటిలోన నుండనేరాదా
తూరనిచ్చి వలపుల దొడ్డిఁ బెట్టవలెనా
(॥ఓరు॥)
వూరకున్న వారికేల వుడుకులు గట్టేవు
సారెసారెఁ బిలిపించి చౌక సేసేవు
కూరిమి గొసరుతానే గుట్టుతోడఁ దిట్టేవు
గారవించి మమ్మునింత కాకు సేయవలెనా
(॥ఓరు॥)
యేమీ నెఱఁగనివారికిట్టే యాస వుట్టించేవు
చేముట్టి సరసమాడి సిగ్గు రేఁచేవు
దోమటి దొడుకుతానే దొమ్మిసేసి చెనకేవు
సాము సేసేనంటా మమ్ముఁ జండి పెట్టవలెనా
(॥ఓరు॥)
సాదువై వుండినవారిఁ జలపట్టి కూడేవు
బోదించి నానారతుల బుజ్జగించేవు
ఆదిగొని శ్రీ వెంకటాద్రీశ నన్నేలితి
వీదెసనె మమ్మునింత యెచ్చరించవలెనా
(||pallavi||)
orusuga yiṁṭilona nuṁḍanerādā
tūranichchi valabula dŏḍḍim̐ bĕṭṭavalĕnā
(||oru||)
vūragunna vārigela vuḍugulu gaṭṭevu
sārĕsārĕm̐ bilibiṁchi sauga sesevu
kūrimi gŏsarudāne guṭṭudoḍam̐ diṭṭevu
gāraviṁchi mammuniṁta kāgu seyavalĕnā
(||oru||)
yemī nĕṟam̐ganivārigiṭṭe yāsa vuṭṭiṁchevu
semuṭṭi sarasamāḍi siggu rem̐sevu
domaḍi dŏḍugudāne dŏmmisesi sĕnagevu
sāmu sesenaṁṭā mammum̐ jaṁḍi pĕṭṭavalĕnā
(||oru||)
sāduvai vuṁḍinavārim̐ jalabaṭṭi kūḍevu
bodiṁchi nānāradula bujjagiṁchevu
ādigŏni śhrī vĕṁkaḍādrīśha nannelidi
vīdĕsanĕ mammuniṁta yĕchchariṁchavalĕnā