ఓరుచుక ఇన్నిఁటికి నూరకుండుటే మేలు
(॥పల్లవి॥)
ఓరుచుక ఇన్నిఁటికి నూరకుండుటే మేలు
యే రీతి వంచుకోవచ్చు నిటు నిన్ను విభుఁడా
(॥ఓరు॥)
చందమామగుటకలు సారె నీ మంచితనాలు
పందెమాడే చెరకులు పనులు నీవి
సందెకాడమఱఁగులు చక్కని నీ చేఁతలు
యెందుకని దూరేము ఇఁక నిన్ను విభుఁడా
(॥ఓరు॥)
యెండమావులనీళ్లు ఇటు నీతో సరసాలు
వండవండనట్లు నీవలపులెల్లా
పండినబూరుగులు నీపచ్చిదేరే సిగ్గులు
చండిపెట్టనేల నిన్ను చలమరివిభుఁడా
(॥ఓరు॥)
తంగేటిపైజున్నులు తచ్చన నీ పొందులు
ముంగిటినిధానాలు మోవితేనెలు
చెంగటఁ గూడితి విట్టె శ్రీవేంకటేశుఁడు నన్ను
పంగించనేల నిన్ను పాయరాని విభుఁడా
(||pallavi||)
orusuga innim̐ṭigi nūraguṁḍuḍe melu
ye rīdi vaṁchugovachchu niḍu ninnu vibhum̐ḍā
(||oru||)
saṁdamāmaguḍagalu sārĕ nī maṁchidanālu
paṁdĕmāḍe sĕragulu panulu nīvi
saṁdĕgāḍamaṟam̐gulu sakkani nī sem̐talu
yĕṁdugani dūremu im̐ka ninnu vibhum̐ḍā
(||oru||)
yĕṁḍamāvulanīḽlu iḍu nīdo sarasālu
vaṁḍavaṁḍanaṭlu nīvalabulĕllā
paṁḍinabūrugulu nībachchidere siggulu
saṁḍibĕṭṭanela ninnu salamarivibhum̐ḍā
(||oru||)
taṁgeḍibaijunnulu tachchana nī pŏṁdulu
muṁgiḍinidhānālu movidenĕlu
sĕṁgaḍam̐ gūḍidi viṭṭĕ śhrīveṁkaḍeśhum̐ḍu nannu
paṁgiṁchanela ninnu pāyarāni vibhum̐ḍā