ఒరుల కొప్పించరాదు వోపనంటే నపకీర్తి
(॥పల్లవి॥)
ఒరుల కొప్పించరాదు వోపనంటే నపకీర్తి
మరలక రక్షించుటే మగపాడి యిఁకను
(॥ఒరుల॥)
సేయరాని తప్పులెల్లాఁ జేసి పచ్చి నిన్నుఁ గొల్చి
యేయెడా బలువుఁడనై యెసగితిని
రాయడి నరకము చొఱక నీ మఱఁగు చొచ్చి
తోయరాని వెల్లాఁ దోసి దొర నైతిని
(॥ఒరుల॥)
వెడమాయ మరునికి వీఁగి వచ్చి నీకు మొక్కి
కడు బిరుదుబంటనై గర్వించితి
వడిఁ బుట్ట బతిమాలి వచ్చి నీ నామధారినై
బడిఁ బాపముల గెలిచి పంతగాఁడ నైతిని
(॥ఒరుల॥)
వొట్టిన కర్మములకు నోడి వచ్చి నీ వాఁడనై
దిట్ట నీ దాసులఁ గూడి ధీరుఁడ నైతి
యిట్టె శ్రీవేంకటేశ యేలితి విందే నన్ను
నెట్టుకొని నిన్నుఁ బాడి నిర్మలుఁడ నైతిని
(||pallavi||)
ŏrula kŏppiṁcharādu vobanaṁṭe nabagīrdi
maralaga rakṣhiṁchuḍe magabāḍi yim̐kanu
(||ŏrula||)
seyarāni tappulĕllām̐ jesi pachchi ninnum̐ gŏlsi
yeyĕḍā baluvum̐ḍanai yĕsagidini
rāyaḍi naragamu sŏṟaga nī maṟam̐gu sŏchchi
toyarāni vĕllām̐ dosi dŏra naidini
(||ŏrula||)
vĕḍamāya marunigi vīm̐gi vachchi nīgu mŏkki
kaḍu birudubaṁṭanai garviṁchidi
vaḍim̐ buṭṭa badimāli vachchi nī nāmadhārinai
baḍim̐ bābamula gĕlisi paṁtagām̐ḍa naidini
(||ŏrula||)
vŏṭṭina karmamulagu noḍi vachchi nī vām̐ḍanai
diṭṭa nī dāsulam̐ gūḍi dhīrum̐ḍa naidi
yiṭṭĕ śhrīveṁkaḍeśha yelidi viṁde nannu
nĕṭṭugŏni ninnum̐ bāḍi nirmalum̐ḍa naidini