ఓరుపే నేరుపందురు వువిదలకు
(॥పల్లవి॥)
ఓరుపే నేరుపందురు వువిదలకు
తారుకాణించేఁ గాని తడవకురే
(॥॥)
మొగముచూచినవాఁడు ముచ్చటాడక మానీనా
నగినవాఁ డిందురాక నాలిసేసీనా
మగువలాల మనమనసు చూచీ నతఁడు
వెగటుగా మీ రింక వెంగెములాడకురే
(॥॥)
చేసన్న చేసినవాఁడు చెప్పకుండీనా ప్రియము
ఆసకొనినవాఁడు అదరించఁడా
యీసులేలే చెలులాల యేఁటికొ వున్నాఁడతఁ డు
రాసి కెక్కించి మీరిఁక రాఁపులు సేయకురే
(॥॥)
చేయిచాఁచినవాఁడు సే చల్లక లోఁగీనా
కాయము ముట్టినవాఁడు కళ రేచఁడా
యీయెడ శ్రీ వేంకటేశుఁ డేలే నన్ను నింతలోనె
చాయల సన్నల నింక సాదించకురే
(||pallavi||)
orube nerubaṁduru vuvidalagu
tārugāṇiṁchem̐ gāni taḍavagure
(||||)
mŏgamusūsinavām̐ḍu muchchaḍāḍaga mānīnā
naginavām̐ ḍiṁdurāga nālisesīnā
maguvalāla manamanasu sūsī nadam̐ḍu
vĕgaḍugā mī riṁka vĕṁgĕmulāḍagure
(||||)
sesanna sesinavām̐ḍu sĕppaguṁḍīnā priyamu
āsagŏninavām̐ḍu adariṁcham̐ḍā
yīsulele sĕlulāla yem̐ṭigŏ vunnām̐ḍadam̐ ḍu
rāsi kĕkkiṁchi mīrim̐ka rām̐pulu seyagure
(||||)
seyisām̐sinavām̐ḍu se sallaga lom̐gīnā
kāyamu muṭṭinavām̐ḍu kaḽa resam̐ḍā
yīyĕḍa śhrī veṁkaḍeśhum̐ ḍele nannu niṁtalonĕ
sāyala sannala niṁka sādiṁchagure