Orsuga naavadda nunnaamdavu

ఓర్చుక నావద్ద నున్నాఁడవు
Language

(॥పల్లవి॥)
ఓర్చుక నావద్ద నున్నాఁడవు
తేర్చి నా గుణము తెలిసితివా

(॥ఓర్చు॥)
నెలఁత నీకు నటు-నేర్పిననేర్పుల
మలకలమాటలు మఱచితివా
పలుకవు మాతోఁ బలుమారు నవ్వేవు
కెలయ కిందుకనె గెలిచేవా

(॥ఓర్చు॥)
వనిత నీకు నటు వంతులు వెట్టిన
మనసులో పనులు మణచితివా
పెనఁగక నాతో బ్రియములు చూపేవు
ననుపు లిందుననె నడపేవా

(॥ఓర్చు॥)
కాంత నీవు ననుఁ గలయు మనిన యల
మంతనపురతులు మఱచితివా
యింతట శ్రీవెంకటేశ్వర ననుఁ గూడితి
సంతత మిట్లనె జరుపేవా

(||pallavi||)
orsuga nāvadda nunnām̐ḍavu
tersi nā guṇamu tĕlisidivā

(||orsu||)
nĕlam̐ta nīgu naḍu-nerbinanerbula
malagalamāḍalu maṟasidivā
palugavu mādom̐ balumāru navvevu
kĕlaya kiṁduganĕ gĕlisevā

(||orsu||)
vanida nīgu naḍu vaṁtulu vĕṭṭina
manasulo panulu maṇasidivā
pĕnam̐gaga nādo briyamulu sūbevu
nanubu liṁdunanĕ naḍabevā

(||orsu||)
kāṁta nīvu nanum̐ galayu manina yala
maṁtanaburadulu maṟasidivā
yiṁtaḍa śhrīvĕṁkaḍeśhvara nanum̐ gūḍidi
saṁtada miṭlanĕ jarubevā