Orisidem juttariga mollagumtem jettariga

ఓరిచితేఁ జుట్టరిక మొల్లకుంటేఁ జెట్టరిక
Language

(॥పల్లవి॥)
ఓరిచితేఁ జుట్టరిక మొల్లకుంటేఁ జెట్టరిక-
మీరసపు వాపోటు లీడనేల

(॥ఓరి॥)
మాటల కెగ్గులు లేవు మనసులోఁ బెరరేఁచె
కూటవకోపాలలోని కొలఁదు లింతే
నేటనే తప్పదు మీకు నెయ్యపు దంపతులాల
యీటులేనిమారు మోము లిప్పుడే యేల

(॥ఓరి॥)
చేఁతలకుఁ దప్పులేదు చేయారఁ దమలోని
పూఁతలపంతాలు రేఁగె బటకా లింతే
రోఁత యింతేసివొట్లు రుచిగాదు జాణలాల
యీఁతలాయఁ జలములు యింకానేల

(॥ఓరి॥)
చూపులో దోసములేదు సూటిగాఁ గందము లోని-
కోపు బొమ్మజంకెనల గుణము లింతే
యేపున శ్రీవేంకటేశ యిందిరా నీవూఁ గూడితి-
రాపనులెల్లాఁదీరె నడుగనేల

(||pallavi||)
orisidem̐ juṭṭariga mŏllaguṁṭem̐ jĕṭṭariga-
mīrasabu vāboḍu līḍanela

(||ori||)
māḍala kĕggulu levu manasulom̐ bĕrarem̐sĕ
kūḍavagobālaloni kŏlam̐du liṁte
neḍane tappadu mīgu nĕyyabu daṁpadulāla
yīḍulenimāru momu lippuḍe yela

(||ori||)
sem̐talagum̐ dappuledu seyāram̐ damaloni
pūm̐talabaṁtālu rem̐gĕ baḍagā liṁte
rom̐ta yiṁtesivŏṭlu rusigādu jāṇalāla
yīm̐talāyam̐ jalamulu yiṁkānela

(||ori||)
sūbulo dosamuledu sūḍigām̐ gaṁdamu loni-
kobu bŏmmajaṁkĕnala guṇamu liṁte
yebuna śhrīveṁkaḍeśha yiṁdirā nīvūm̐ gūḍidi-
rābanulĕllām̐dīrĕ naḍuganela