ఓరిచేను నీ సుద్దులు వొడఁబడ్డదాఁకాను
(॥పల్లవి॥)
ఓరిచేను నీ సుద్దులు వొడఁబడ్డదాఁకాను
జీరవారెఁ జెక్కుమీఁదఁ జేయవయ్య చేఁతలు
(॥ఓరి॥)
తప్పక చూచినందుకే తగవులఁ బెట్టేవు
ఇప్పుడు గొంగు వట్టితే నేమి సేతువో
కుప్పలై యిరుగు పొరుగులవారు చూచి చూచి
చెప్పేరు నీకు బుద్ది సేయవయ్య చేఁతలు
(॥ఓరి॥)
మాటలాడినందుకే మంకుఁదనాలు రేఁగేవు
యీటున వెంగెమాడితే యేమిసేతువో
జూటరిచెలులు నీ చుట్టాలయ్యే నవ్వేరు
చీటికి మాటికి నీవు సేయవయ్య చేఁతలు
(॥ఓరి॥)
చేయి చాఁచినందుకే సిగ్గులతోఁ బెనఁగేవు
యీయెడఁ గాఁగిలించితే నేమి సేతువో
పాయక శ్రీ వేంకటేశ పైకొని కూడితి నన్ను
చేయిమీఁదాయఁ బనులు సేయవయ్య చేఁతలు
(||pallavi||)
orisenu nī suddulu vŏḍam̐baḍḍadām̐kānu
jīravārĕm̐ jĕkkumīm̐dam̐ jeyavayya sem̐talu
(||ori||)
tappaga sūsinaṁduge tagavulam̐ bĕṭṭevu
ippuḍu gŏṁgu vaṭṭide nemi seduvo
kuppalai yirugu pŏrugulavāru sūsi sūsi
sĕpperu nīgu buddi seyavayya sem̐talu
(||ori||)
māḍalāḍinaṁduge maṁkum̐danālu rem̐gevu
yīḍuna vĕṁgĕmāḍide yemiseduvo
jūḍarisĕlulu nī suṭṭālayye navveru
sīḍigi māḍigi nīvu seyavayya sem̐talu
(||ori||)
seyi sām̐sinaṁduge sigguladom̐ bĕnam̐gevu
yīyĕḍam̐ gām̐giliṁchide nemi seduvo
pāyaga śhrī veṁkaḍeśha paigŏni kūḍidi nannu
seyimīm̐dāyam̐ banulu seyavayya sem̐talu