ఓరి పో యిదేడ సుద్ది వుండఁ బట్టదా । వోసి ।
(॥పల్లవి॥)
ఓరి పో యిదేడ సుద్ది వుండఁ బట్టదా । వోసి ।
వోరి కొట్లు గొట్టఁగా వొద్దికి వచ్చితినే
(॥ఓరి॥)
గొల్లపిన్న వాఁడా గోవులఁ జక్కఁ గావరా
యిల్లిదె మావాకిలి నీ వేల కాచేవు
కల్ల గాదె నీమాట నేఁ గాచే ఆవులపాల
చల్ల లమ్మఁ బోఁగానె పో సాదించ వచ్చితిని
(॥ఓరి॥)
బాలకృష్ణబోయిఁడా పసులు వల్లె వేయరా
వాలుఁ జూపుల మ మ్మేల వల్లె వేసేవు
నేలనుండి మాకోడెలు నీ యింటిచూరు మేసె
తోలవైతి వందుకే పో దూరులు వేసితిని
(॥ఓరి॥)
నాలి శ్రీవెంకటేశుఁడ నాచన్ను లెల పట్టేవు
చాలదా నీవు పసుల చను పట్టేది
మేలిమి ఆవులవారి మెలుతలు మీరు గాన
మూల నన్ను మీ చన్నులు ముట్టి నేఁ గూడితిని
(||pallavi||)
ori po yideḍa suddi vuṁḍam̐ baṭṭadā | vosi |
vori kŏṭlu gŏṭṭam̐gā vŏddigi vachchidine
(||ori||)
gŏllabinna vām̐ḍā govulam̐ jakkam̐ gāvarā
yillidĕ māvāgili nī vela kāsevu
kalla gādĕ nīmāḍa nem̐ gāse āvulabāla
salla lammam̐ bom̐gānĕ po sādiṁcha vachchidini
(||ori||)
bālakṛṣhṇaboyim̐ḍā pasulu vallĕ veyarā
vālum̐ jūbula ma mmela vallĕ vesevu
nelanuṁḍi māgoḍĕlu nī yiṁṭisūru mesĕ
tolavaidi vaṁduge po dūrulu vesidini
(||ori||)
nāli śhrīvĕṁkaḍeśhum̐ḍa nāsannu lĕla paṭṭevu
sāladā nīvu pasula sanu paṭṭedi
melimi āvulavāri mĕludalu mīru gāna
mūla nannu mī sannulu muṭṭi nem̐ gūḍidini