ఓరి నీవు నే నేమన్నా నోరువలేవా
(॥పల్లవి॥)
ఓరి నీవు నే నేమన్నా నోరువలేవా
బీరాలు నెరపుదువు పిఱితీసేవా
(॥ఓరి॥)
నవ్వులకు కొనగోరు నాఁటించిన యంతలోనే
యవ్వల నొచ్చ ననేవు యిది యేరా
రవ్వలుగాఁ దొల్లి నీవు రావణుతోఁ బోరినది
అవ్వల నేనెంచుకొంటే నరు దయ్యీరా
(॥ఓరి॥)
మనసు చూడవలసి చనుఁగొండల నొత్తితే
కినిసి యంతటిలోనే కిందుపడేవు
వెనకకు మందరము వీఁపున మోఁచి తచ్చిన-
పనులు ని న్నెంచితేను పచ్చి దేరీరా
(॥ఓరి॥)
చుట్టమనై నిన్ను రతి సూడు వట్టి కూడితేను
అట్టె శ్రీవేంకటేశ అలసేవు
గుట్టునఁ బదారువేలఁ గూడితి వనెడిమాఁట
యిట్టె నీమీఁద మోపితే యెరవయ్యీరా
(||pallavi||)
ori nīvu ne nemannā noruvalevā
bīrālu nĕrabuduvu piṟidīsevā
(||ori||)
navvulagu kŏnagoru nām̐ṭiṁchina yaṁtalone
yavvala nŏchcha nanevu yidi yerā
ravvalugām̐ dŏlli nīvu rāvaṇudom̐ borinadi
avvala nenĕṁchugŏṁṭe naru dayyīrā
(||ori||)
manasu sūḍavalasi sanum̐gŏṁḍala nŏttide
kinisi yaṁtaḍilone kiṁdubaḍevu
vĕnagagu maṁdaramu vīm̐puna mom̐si tachchina-
panulu ni nnĕṁchidenu pachchi derīrā
(||ori||)
suṭṭamanai ninnu radi sūḍu vaṭṭi kūḍidenu
aṭṭĕ śhrīveṁkaḍeśha alasevu
guṭṭunam̐ badāruvelam̐ gūḍidi vanĕḍimām̐ṭa
yiṭṭĕ nīmīm̐da mobide yĕravayyīrā