Ori neegu nadi yemi vumdambattadaa

ఓరి నీకు నది యేమి వుండఁబట్టదా
Language

(॥పల్లవి॥)
ఓరి నీకు నది యేమి వుండఁబట్టదా
వారి వీరివలె మాట వడిఁ బెట్టవద్దురా

(॥ఓరి॥)
యీసు రేఁచ నేఁటికి యందరిలోపల నిన్ను
వాసి దెచ్చుకొని యెంత వంచఁ జూతునో
రాసి కెక్కితివి తొల్లె రచ్చకూ నెక్కితివి
బేసబెల్లి నా కోపము పెంచ నిఁక వొద్దురా

(॥ఓరి॥)
కన్నుసన్న లేటికి కడు సిగ్గునను నీ
మన్ననఁ గూడి యే మని మాటాడుదువో
వెన్న వేసినవారిని వెస రాత వెయ్య రాదు
అన్నిటా జాణఁ జేసితి వటు మీర వద్దురా

(॥ఓరి॥)
దొమ్మి సేయ నేఁటికి తొడిఁబడఁ గాఁగిటి మీ
యిమ్ముల నిన్నలయించి యే ముందునో
నమ్మించి శ్రీవెంకటేశ నన్నుఁ గూడితివి నీవు
సమ్మతించిన మీఁదటఁ జలపట్ట వద్దురా

(||pallavi||)
ori nīgu nadi yemi vuṁḍam̐baṭṭadā
vāri vīrivalĕ māḍa vaḍim̐ bĕṭṭavaddurā

(||ori||)
yīsu rem̐sa nem̐ṭigi yaṁdarilobala ninnu
vāsi dĕchchugŏni yĕṁta vaṁcham̐ jūduno
rāsi kĕkkidivi tŏllĕ rachchagū nĕkkidivi
besabĕlli nā kobamu pĕṁcha nim̐ka vŏddurā

(||ori||)
kannusanna leḍigi kaḍu siggunanu nī
mannanam̐ gūḍi ye mani māḍāḍuduvo
vĕnna vesinavārini vĕsa rāda vĕyya rādu
anniḍā jāṇam̐ jesidi vaḍu mīra vaddurā

(||ori||)
dŏmmi seya nem̐ṭigi tŏḍim̐baḍam̐ gām̐giḍi mī
yimmula ninnalayiṁchi ye muṁduno
nammiṁchi śhrīvĕṁkaḍeśha nannum̐ gūḍidivi nīvu
sammadiṁchina mīm̐daḍam̐ jalabaṭṭa vaddurā