Orayusu nuramuna nunisidi veege neevu

ఒరయుచు నురమున నునిచితి వీకె నీవు
Language

(॥పల్లవి॥)
ఒరయుచు నురమున నునిచితి వీకె నీవు
అరయఁ గాంతారత్న మన్నిటాఁ గనక

(॥ఒరయు॥)
మాటలాడి చూచితేనే మంచివైడూర్యాలు రాలీ
గాట్టఁపుజూపల మాణికాలు రాలీని
మూటగాఁగ నవ్వితే ముత్యాలు రాలీని
కూటువ నీసతి రత్నకోమలి గనక

(॥ఒరయు॥)
బడినడుగడుగుకుఁ బద్మరాగములు రాలీ
జడిసి పొలసిఁ బచ్చలు రాలీని
పడఁతి చేవిసరినఁ బగడాలు రాలీని
నడుమ నీసతి యంగనామణి గనక

(॥ఒరయు॥)
కుంకుమచెమటల గోమేధికాలు రాలీ
సంకుగోరికొన వజ్రాలు రాలీని
పొంకపుఁబుష్యరాగాలు పొంగీ నీకూటమిని
ఇంక శ్రీ వేంకటేశ నీయింతి రత్నాంగి గాన

(||pallavi||)
ŏrayusu nuramuna nunisidi vīgĕ nīvu
arayam̐ gāṁtāratna manniḍām̐ ganaga

(||ŏrayu||)
māḍalāḍi sūsidene maṁchivaiḍūryālu rālī
gāṭṭam̐pujūbala māṇigālu rālīni
mūḍagām̐ga navvide mutyālu rālīni
kūḍuva nīsadi ratnagomali ganaga

(||ŏrayu||)
baḍinaḍugaḍugugum̐ badmarāgamulu rālī
jaḍisi pŏlasim̐ bachchalu rālīni
paḍam̐ti sevisarinam̐ bagaḍālu rālīni
naḍuma nīsadi yaṁganāmaṇi ganaga

(||ŏrayu||)
kuṁkumasĕmaḍala gomedhigālu rālī
saṁkugorigŏna vajrālu rālīni
pŏṁkabum̐buṣhyarāgālu pŏṁgī nīgūḍamini
iṁka śhrī veṁkaḍeśha nīyiṁti ratnāṁgi gāna