Orabu neruduve voyammaa

ఒరపు నేరుతువే వోయమ్మా
Language

(॥పల్లవి॥)
ఒరపు నేరుతువే వోయమ్మా
సరగున నతని నాసలఁ బెట్టేవే

(॥ఒర॥)
కలువకన్నులను కాఁటుకలొలుకఁగ
సొలసి యెంత పతిఁ జూతేవే
సెలవులఁ జిందేటిచిరునవ్వులతో
పలుకు లెంతవడి పచరించేవే

(॥ఒర॥)
శిరసు పై నెరులు చెంపల జారఁగ
సరసము లెందాఁగ జరపేవే
అరిమురి గళబెళమను వయ్యెదతో
విరుల నే లతని వేసేవే

(॥ఒర॥)
చనుమొనలఁ జెమట జడిగొని వడియఁగ
వొనరఁ బాదము లెట్లొత్తేవే
యెనసెను శ్రీవేంకటేశుఁడు నను నిదె
పెనఁగుచు నాతని బెరసేవౌనే

(||pallavi||)
ŏrabu neruduve voyammā
saraguna nadani nāsalam̐ bĕṭṭeve

(||ŏra||)
kaluvagannulanu kām̐ṭugalŏlugam̐ga
sŏlasi yĕṁta padim̐ jūdeve
sĕlavulam̐ jiṁdeḍisirunavvulado
palugu lĕṁtavaḍi pasariṁcheve

(||ŏra||)
śhirasu pai nĕrulu sĕṁpala jāram̐ga
sarasamu lĕṁdām̐ga jarabeve
arimuri gaḽabĕḽamanu vayyĕdado
virula ne ladani veseve

(||ŏra||)
sanumŏnalam̐ jĕmaḍa jaḍigŏni vaḍiyam̐ga
vŏnaram̐ bādamu lĕṭlŏtteve
yĕnasĕnu śhrīveṁkaḍeśhum̐ḍu nanu nidĕ
pĕnam̐gusu nādani bĕrasevaune