ఒప్పమి మేలై యొనఁగూడె నాకు
(॥పల్లవి॥)
ఒప్పమి మేలై యొనఁగూడె నాకు
నె(త)?ప్పులే ఒప్పవుట చెప్పనేలమ్మా
(॥ఒప్పమి॥)
నవ్వులచూపులు నాఁటినచోటు
నొవ్వులు సేయక నొచ్చీనే
దవ్వులమాటలు తాఁకినతావూ
రవ్వలచేఁతల రాఁగీనే
(॥ఒప్పమి॥)
తియ్యపుఁ జేఁతలఁ ద్రెవ్వినచోటు
వయ్యమై హృదయము నాడీనె
కయ్యపుఁ గాఁకలఁ గ్రాఁగినతావూ
ఒయ్యన పై పై నుడికీనే
(॥ఒప్పమి॥)
కొండలరాయనిఁ గూడిన మనసూ
కొండయి లోలోనె కూడీనే
నిండిన తమకము నించిన యతఁడూ
మెండైన నాప్రేమ మెచ్చీనే
(||pallavi||)
ŏppami melai yŏnam̐gūḍĕ nāgu
nĕ(ta)?ppule ŏppavuḍa sĕppanelammā
(||ŏppami||)
navvulasūbulu nām̐ṭinasoḍu
nŏvvulu seyaga nŏchchīne
davvulamāḍalu tām̐kinadāvū
ravvalasem̐tala rām̐gīne
(||ŏppami||)
tiyyabum̐ jem̐talam̐ drĕvvinasoḍu
vayyamai hṛdayamu nāḍīnĕ
kayyabum̐ gām̐kalam̐ grām̐ginadāvū
ŏyyana pai pai nuḍigīne
(||ŏppami||)
kŏṁḍalarāyanim̐ gūḍina manasū
kŏṁḍayi lolonĕ kūḍīne
niṁḍina tamagamu niṁchina yadam̐ḍū
mĕṁḍaina nāprema mĕchchīne