ఒప్పగించితినంటాను వూరకేల మమ్మనేవు
(॥పల్లవి॥)
ఒప్పగించితినంటాను వూరకేల మమ్మనేవు
నెప్పున నే మొరసితే నిన్ను సోఁకి రాదా
(॥ఒప్పు॥)
సలిగె గలిగినాపె సణఁగులు రాలిచితే
నిలువునఁ జేకొనఁగ నీకె హితవు
అలరి సవతులము అంది వాదు లడిచితే
నెలకొన్న మాఁటలెల్ల నిన్ను సోఁకి రాదా
(॥ఒప్పు॥)
చిత్తము వచ్చినయాపె చేతికొన దాఁకించితే
హత్తి నీకె సరసములై వుండును
పొత్తుల మగువలము పూనుకొని వచ్చితేను
నిత్తెమైన అలవాటు నిన్ను సోఁకిరాదా
(॥ఒప్పు॥)
కదిసిన యాపె నీ కందువలు రేఁచితే
యిదె శ్రీ వేంకటేశ నీ యెమ్మ(మ్మె)లు మించు
అదునుగాఁగా నేము అలమి భోగించితిమి
నిదురకన్నుల నవ్వు నిన్ను సోఁకి రాదా
(||pallavi||)
ŏppagiṁchidinaṁṭānu vūragela mammanevu
nĕppuna ne mŏraside ninnu som̐ki rādā
(||ŏppu||)
saligĕ galiginābĕ saṇam̐gulu rāliside
niluvunam̐ jegŏnam̐ga nīgĕ hidavu
alari savadulamu aṁdi vādu laḍiside
nĕlagŏnna mām̐ṭalĕlla ninnu som̐ki rādā
(||ŏppu||)
sittamu vachchinayābĕ sedigŏna dām̐kiṁchide
hatti nīgĕ sarasamulai vuṁḍunu
pŏttula maguvalamu pūnugŏni vachchidenu
nittĕmaina alavāḍu ninnu som̐kirādā
(||ŏppu||)
kadisina yābĕ nī kaṁduvalu rem̐side
yidĕ śhrī veṁkaḍeśha nī yĕmma(mmĕ)lu miṁchu
adunugām̐gā nemu alami bhogiṁchidimi
niduragannula navvu ninnu som̐ki rādā