Ooru mechcha badugave voddaaramela

ఊరు మెచ్చ బతుకవే వొడ్డారమేల
Language

(॥పల్లవి॥)
ఊరు మెచ్చ బతుకవే వొడ్డారమేల
సారెకును బిగిసితే సరుస మంకందురు

(॥ఊరు॥)
పలుకఁ గదవే నీవు పై పై సిగ్గులివేల
చలి వాసె వలపులు సరసాననే
తలయెత్తి చూడఁగదె తగవు గాదెవ్వరైన
చలపాది యిదియెంత సణఁగులాడెందురు

(॥ఊరు॥)
నగఁ గదవె నాతో నాలిగోలతనమేల
చిగిరించెఁ గోరికలు చేచేఁతనే
బిగియక రాఁగదవె బీరాన నిన్నిదిచూచి
వెగటున నెవ్వరైన విటుకులాడెందురు

(॥ఊరు॥)
కాఁగిలించఁ గదె నన్ను కమ్మటి నీవెరపేల
యేఁగి వచ్చి కూడితిమి యిందాఁకానే
పాఁగిన శ్రీవేంకటాధిపతి నన్ను నేమన్నాఁ
గాఁగాదు యిదియెంత కరతలాడెందురు

(||pallavi||)
ūru mĕchcha badugave vŏḍḍāramela
sārĕgunu bigiside sarusa maṁkaṁduru

(||ūru||)
palugam̐ gadave nīvu pai pai siggulivela
sali vāsĕ valabulu sarasānane
talayĕtti sūḍam̐gadĕ tagavu gādĕvvaraina
salabādi yidiyĕṁta saṇam̐gulāḍĕṁduru

(||ūru||)
nagam̐ gadavĕ nādo nāligoladanamela
sigiriṁchĕm̐ gorigalu sesem̐tane
bigiyaga rām̐gadavĕ bīrāna ninnidisūsi
vĕgaḍuna nĕvvaraina viḍugulāḍĕṁduru

(||ūru||)
kām̐giliṁcham̐ gadĕ nannu kammaḍi nīvĕrabela
yem̐gi vachchi kūḍidimi yiṁdām̐kāne
pām̐gina śhrīveṁkaḍādhibadi nannu nemannām̐
gām̐gādu yidiyĕṁta karadalāḍĕṁduru