ఊరివారిఁ జూచి చూచి వూరకే నోరూరనేల
(॥పల్లవి॥)
ఊరివారిఁ జూచి చూచి వూరకే నోరూరనేల
ఆరీతి నీకెందుకైనా ఆసపడనేఁటికి
(॥ఊరి॥)
కన్నులెంత గనమైనాఁ గాంతకే చక్కఁదనము
చన్నులెంత గనమైనా సాగు బలిమి
యెన్నుకొంటా సారె సారె నేల యేఁకరేవు నీవు
విన్ను నీవెంచుకోరాదా నీకేల యీగొడవ
(॥ఊరి॥)
నెఱి దురుమెఁతైనా నెలఁతకే సింగారము
పిఱుఁ దెంతబటువైనా పెద్దఱికమే
పఱచై పొగడ నీవు బట్టువాఁడవా యేమి
గుఱుతువెట్టుకొనరాదా కొంచపడనేఁటికి
(॥ఊరి॥)
మొగమెంత మెఱుఁగైనా ముద్దుగాఁ జెలియకు
నగవెంత గలిగినా నయమై తోఁచు
వెగటుదీర శ్రీవేంకటేశ కూడితివి
మగువనే మెచ్చరాదా మచ్చికలే నిండును
(||pallavi||)
ūrivārim̐ jūsi sūsi vūrage norūranela
ārīdi nīgĕṁdugainā āsabaḍanem̐ṭigi
(||ūri||)
kannulĕṁta ganamainām̐ gāṁtage sakkam̐danamu
sannulĕṁta ganamainā sāgu balimi
yĕnnugŏṁṭā sārĕ sārĕ nela yem̐karevu nīvu
vinnu nīvĕṁchugorādā nīgela yīgŏḍava
(||ūri||)
nĕṟi durumĕm̐tainā nĕlam̐tage siṁgāramu
piṟum̐ dĕṁtabaḍuvainā pĕddaṟigame
paṟasai pŏgaḍa nīvu baṭṭuvām̐ḍavā yemi
guṟuduvĕṭṭugŏnarādā kŏṁchabaḍanem̐ṭigi
(||ūri||)
mŏgamĕṁta mĕṟum̐gainā muddugām̐ jĕliyagu
nagavĕṁta galiginā nayamai tom̐su
vĕgaḍudīra śhrīveṁkaḍeśha kūḍidivi
maguvane mĕchcharādā machchigale niṁḍunu