ఊరివారి గుణములు వొడ్డి మాకేల చెప్పేవు
(॥పల్లవి॥)
ఊరివారి గుణములు వొడ్డి మాకేల చెప్పేవు
నేరిచిన ట్టూడిగాలు నేఁ జేసేఁ గాక
(॥॥)
యెవ్వరికైనాఁ జనవు లిత్తువు నీవు
నవ్వుతాఁ జుట్టరికము నానవేతువు
వువిళ్లూరఁ జేయుదువు వొద్దివారిని
నివ్వటిల్లే నీకతలు నేమెఱఁగమా
(॥॥)
పొరుగువారి పొందులు పొగడుదువు
తలమెఱిఁగి సేతువు తరితీపులు
వొరసి మాఁటలనే నోరూరింతువు
గరిమ నీవోజలు కన్నవేకావా
(॥॥)
మెత్తు వేమిటికినైనా మెలుఁతలను
హత్తి కౌఁగిలించుకొందు వంతలోననే
యిత్తల శ్రీ వేనికటేశ యేనలమేలుమంగను
పొత్తుల నన్నేలితివి కొత్తలు గావా
(||pallavi||)
ūrivāri guṇamulu vŏḍḍi māgela sĕppevu
nerisina ṭṭūḍigālu nem̐ jesem̐ gāga
(||||)
yĕvvarigainām̐ janavu littuvu nīvu
navvudām̐ juṭṭarigamu nānaveduvu
vuviḽlūram̐ jeyuduvu vŏddivārini
nivvaḍille nīgadalu nemĕṟam̐gamā
(||||)
pŏruguvāri pŏṁdulu pŏgaḍuduvu
talamĕṟim̐gi seduvu taridībulu
vŏrasi mām̐ṭalane norūriṁtuvu
garima nīvojalu kannavegāvā
(||||)
mĕttu vemiḍiginainā mĕlum̐talanu
hatti kaum̐giliṁchugŏṁdu vaṁtalonane
yittala śhrī venigaḍeśha yenalamelumaṁganu
pŏttula nannelidivi kŏttalu gāvā