Oori maganaamdlagu numdam baasenu

ఊరి మగనాండ్లకు నుండఁ బాసెను
Language

(॥పల్లవి॥)
ఊరి మగనాండ్లకు నుండఁ బాసెను
యీ రీతి నన్నింత సేసె నే మందు నమ్మా

(॥ఊరి॥)
వొల్ల ననఁగానె వచ్చి వొక టొకటె యాడి
చెల్లఁ బో వీఁడు నా చేయి వట్టీని
పల్లదపు వీనిచేతి బాధకుఁ గాక నేను
యిల్లిదె నే లోనయితి నిఁక నేఁటి దమ్మా

(॥ఊరి॥)
తల వంచు కుండఁగానె దగ్గరి వద్దఁ గూచుండి
చలి వాయ మాట లాడీ జాణతనాలు
చలపాది వీనిచేతి చండకు నోపక నేను
చెలరేఁగి కాఁపురము సేసితి నో యమ్మా

(॥ఊరి॥)
యింటివారికి వెరవఁ డెదుట నవ్వులు నవ్వి
చంటిమీఁద నొరగుచు సట సేసీని
వెంటఁ బాయ కిది వో శ్రీవెంకటేశ్వరుఁడు గూడె
దంట నై వీనిమాయఁ దగిలితి నమ్మా

(||pallavi||)
ūri maganāṁḍlagu nuṁḍam̐ bāsĕnu
yī rīdi nanniṁta sesĕ ne maṁdu nammā

(||ūri||)
vŏlla nanam̐gānĕ vachchi vŏga ṭŏgaḍĕ yāḍi
sĕllam̐ bo vīm̐ḍu nā seyi vaṭṭīni
palladabu vīnisedi bādhagum̐ gāga nenu
yillidĕ ne lonayidi nim̐ka nem̐ṭi dammā

(||ūri||)
tala vaṁchu kuṁḍam̐gānĕ daggari vaddam̐ gūsuṁḍi
sali vāya māḍa lāḍī jāṇadanālu
salabādi vīnisedi saṁḍagu nobaga nenu
sĕlarem̐gi kām̐puramu sesidi no yammā

(||ūri||)
yiṁṭivārigi vĕravam̐ ḍĕduḍa navvulu navvi
saṁṭimīm̐da nŏragusu saḍa sesīni
vĕṁṭam̐ bāya kidi vo śhrīvĕṁkaḍeśhvarum̐ḍu gūḍĕ
daṁṭa nai vīnimāyam̐ dagilidi nammā