ఊరకున్నవారితోడ వూ రోప దన్నమాఁట
(॥పల్లవి॥)
ఊరకున్నవారితోడ వూ రోప దన్నమాఁట
నేరుచుకొంటి నేను నీ వేమి సేసేవే
(॥ఊరకున్న॥)
చుట్టము లయినవారు సొలసి సొలసి యంత
తిట్టినా యెగ్గు లౌనా తేజమే కాక
వొట్టి నీవు కోపగించి వూరకే యే మనినాను
నట్టనడుమను నాకు నవ్వు వచ్చీనే
(॥ఊరకున్న॥)
చేతికి లో నైనవారు చెనకి యంత మీరినా
ఘాలతలను హీన మౌనా ఘనతే కాక
పోతరించి నీవు నన్ను పూఁచి యేమి సేసినాను
జాతి నా మన సన్నిటా సమ్మతించీనే
(॥ఊరకున్న॥)
కాఁగిఁట గూడినవారు కడుఁ దమకించినాను
మూఁగి వేసట వుట్టునా ముదేమే కాక
యేఁగి వచ్చి శ్రీవెంకటేశుఁడ కూడితి నన్ను
వీఁగని నీ రతు లెల్ల విందు లయ్యీనే
(||pallavi||)
ūragunnavāridoḍa vū roba dannamām̐ṭa
nerusugŏṁṭi nenu nī vemi seseve
(||ūragunna||)
suṭṭamu layinavāru sŏlasi sŏlasi yaṁta
tiṭṭinā yĕggu launā tejame kāga
vŏṭṭi nīvu kobagiṁchi vūrage ye maninānu
naṭṭanaḍumanu nāgu navvu vachchīne
(||ūragunna||)
sedigi lo nainavāru sĕnagi yaṁta mīrinā
ghāladalanu hīna maunā ghanade kāga
podariṁchi nīvu nannu pūm̐si yemi sesinānu
jādi nā mana sanniḍā sammadiṁchīne
(||ūragunna||)
kām̐gim̐ṭa gūḍinavāru kaḍum̐ damagiṁchinānu
mūm̐gi vesaḍa vuṭṭunā mudeme kāga
yem̐gi vachchi śhrīvĕṁkaḍeśhum̐ḍa kūḍidi nannu
vīm̐gani nī radu lĕlla viṁdu layyīne