ఊరకున్నవారి కేల వుడుకులు గట్టేవు
(॥పల్లవి॥)
ఊరకున్నవారి కేల వుడుకులు గట్టేవు
సారె సారె నీతోడి జగడాలదాననా
(॥ఊర॥)
కోవిలకూఁతలకుఁగా గొణఁగుకొంటిఁ గాక
ఆనల ని న్నేడనైనా నాడుకొంటినా
వావాతఁ జిలుకలతో వాదు లడిచితి గాక
భావించి ని న్నొకటైనాఁ బలికితినా
(॥ఊర॥)
దవ్వుల నుండినలేటిఁ దప్పక చూచితిఁ గాక
రవ్వల నీ వంటఁగాఁ బరారైతినా
పువ్వుటమ్ములు నాటఁ బోఁ దోసితిఁ గాక
కొవ్వి పలు నీ వియ్యఁగా కొంగుచాఁచకుందునా
(॥ఊర॥)
పచ్చిగాలి వేఁడిఁ గాఁగ పానుపు చేరితిఁ గాక
యిచ్చట నీ వుండినది యెఱుఁగుదునా
గచ్చుల శ్రీవేంకటేశ కలసితి విటు నన్ను
మెచ్చి గో రూఁదితిఁ గాకఁ మేరలు మీఱితినా
(||pallavi||)
ūragunnavāri kela vuḍugulu gaṭṭevu
sārĕ sārĕ nīdoḍi jagaḍāladānanā
(||ūra||)
kovilagūm̐talagum̐gā gŏṇam̐gugŏṁṭim̐ gāga
ānala ni nneḍanainā nāḍugŏṁṭinā
vāvādam̐ jilugalado vādu laḍisidi gāga
bhāviṁchi ni nnŏgaḍainām̐ baligidinā
(||ūra||)
davvula nuṁḍinaleḍim̐ dappaga sūsidim̐ gāga
ravvala nī vaṁṭam̐gām̐ barāraidinā
puvvuḍammulu nāḍam̐ bom̐ dosidim̐ gāga
kŏvvi palu nī viyyam̐gā kŏṁgusām̐saguṁdunā
(||ūra||)
pachchigāli vem̐ḍim̐ gām̐ga pānubu seridim̐ gāga
yichchaḍa nī vuṁḍinadi yĕṟum̐gudunā
gachchula śhrīveṁkaḍeśha kalasidi viḍu nannu
mĕchchi go rūm̐didim̐ gāgam̐ meralu mīṟidinā