Ooragunnam boneevu voga togade remsevu

ఊరకున్నఁ బోనీవు వొక టొకటే రేఁచేవు
Language

(॥పల్లవి॥)
ఊరకున్నఁ బోనీవు వొక టొకటే రేఁచేవు
గోర గీరితే నేరౌ మా కూటమి కోపుదువా

(॥ఊరకున్న॥)
చిగురుఁగెమ్మో సోఁకఁ జేరి నే మాడెటిమాఁట
వొగరు లై తోఁచు నందు కోపుదువా
పొగరుతమ్మికన్నుల పూఁచి నేఁజూచెటిచూపు
నిగుడునమ్ము లై తోఁచు నీ వోపుదువా

(॥ఊరకున్న॥)
కొండలవంటి చన్నులు కోరి నిన్నుఁ దాఁకించితే
వుం డుండె కుమ్మెలు వోవు నోపుదువా
బండివంటి మాపిరుఁదు బడి నీకుఁ దగిలితే
అండ నీపైఁ బారుఁ జేసు నందు కోపుదువా

(॥ఊరకున్న॥)
చల్లు మావూరుపుగాలి సమరతివేళల
వుల్ల మెల్లఁ జిందు సేసు నోపుదువా
యెల్లగా శ్రీవెంకటేశ యిట్టె నన్నుఁ గూడితివి
పెల్లు రేఁగి నేఁడు నాతోఁ బెనఁగ నోపుదువా

(||pallavi||)
ūragunnam̐ bonīvu vŏga ṭŏgaḍe rem̐sevu
gora gīride nerau mā kūḍami kobuduvā

(||ūragunna||)
sigurum̐gĕmmo som̐kam̐ jeri ne māḍĕḍimām̐ṭa
vŏgaru lai tom̐su naṁdu kobuduvā
pŏgarudammigannula pūm̐si nem̐jūsĕḍisūbu
niguḍunammu lai tom̐su nī vobuduvā

(||ūragunna||)
kŏṁḍalavaṁṭi sannulu kori ninnum̐ dām̐kiṁchide
vuṁ ḍuṁḍĕ kummĕlu vovu nobuduvā
baṁḍivaṁṭi mābirum̐du baḍi nīgum̐ dagilide
aṁḍa nībaim̐ bārum̐ jesu naṁdu kobuduvā

(||ūragunna||)
sallu māvūrubugāli samaradiveḽala
vulla mĕllam̐ jiṁdu sesu nobuduvā
yĕllagā śhrīvĕṁkaḍeśha yiṭṭĕ nannum̐ gūḍidivi
pĕllu rem̐gi nem̐ḍu nādom̐ bĕnam̐ga nobuduvā