ఊరకున్నాఁడ వదేమి వొకటీ నౌఁగాదనవు
(॥పల్లవి॥)
ఊరకున్నాఁడ వదేమి వొకటీ నౌఁగాదనవు
కోరితి నిన్నే సాకిరి కొంచకువయ్యా
(॥ఊర॥)
బచ్చనలు వచరించి బలిమి నే నీపొందు
నిచ్చఁ జేసితి వనేరు నిజమా యిది
పచ్చిగా నీ సేరుపులు పైపై నే మెచ్చినది
గచ్చులకు ననేరు కలదా యిది
(॥ఊర॥)
కన్నులఁ గాఁకలు చల్లి కడు నిన్ను భ్రమియించి
అన్నిటా మీరితి ననే రవునా యిది
మొన్నటనుండి నీమోము చూచి రమ్మంటా
సన్న సేసితి ననేరు సమ్మతా యిది
(॥ఊర॥)
కందువల నిన్నుఁ గూడి కమ్మటిఁ గొసరేనంటా
యిందరు ననేరు నీ కితవా యిది
అందపు శ్రీ వేంకటేశ అప్పటి నన్నుఁ గూడితిఁ
విందు నాగోరితాఁకు నీ కెరుకాయనో
(||pallavi||)
ūragunnām̐ḍa vademi vŏgaḍī naum̐gādanavu
koridi ninne sāgiri kŏṁchaguvayyā
(||ūra||)
bachchanalu vasariṁchi balimi ne nībŏṁdu
nichcham̐ jesidi vaneru nijamā yidi
pachchigā nī serubulu paibai ne mĕchchinadi
gachchulagu naneru kaladā yidi
(||ūra||)
kannulam̐ gām̐kalu salli kaḍu ninnu bhramiyiṁchi
anniḍā mīridi nane ravunā yidi
mŏnnaḍanuṁḍi nīmomu sūsi rammaṁṭā
sanna sesidi naneru sammadā yidi
(||ūra||)
kaṁduvala ninnum̐ gūḍi kammaḍim̐ gŏsarenaṁṭā
yiṁdaru naneru nī kidavā yidi
aṁdabu śhrī veṁkaḍeśha appaḍi nannum̐ gūḍidim̐
viṁdu nāgoridām̐ku nī kĕrugāyano