Ooragunnaam boneedu vudivoni javvanamu

ఊరకున్నాఁ బోనీదు వుడివోని జవ్వనము
Language

(॥పల్లవి॥)
ఊరకున్నాఁ బోనీదు వుడివోని జవ్వనము
తారుకాణ లివి నీకు దాఁగవచ్చునటరే

(॥ఊర॥)
కనుచూపులు సోఁకితే కలయికలు రేఁచును
మనసు లెనసితేను మర్మము లంటు
చెనకులు వేడుకైతే సేసిన చేఁతలు చెల్లు
పెనచితే నొందొకటి పెనులంకెలే

(॥ఊర॥)
యెడమాఁటలు వింటేనే హెచ్చుఁ దరితీపులు
బడివాయకుండితేఁ జొప్పఁడు జెలిమి
వొడఁబాటు గలిగితే నొనగూడుఁ గాఁగిళ్ళు
తడయ కొండొకటికిఁ దగులాయమే

(॥ఊర॥)
నవ్వులకు లోనైతే నాము లెక్కు వలపులు
వువ్విళ్ళూరఁ బెనఁగితే నుబ్బించు మేను
ఇవ్వల శ్రీవేంకటేశుఁ డిన్నిటాను నిన్ను నేలె
నివ్వటిల్ల నొండొంటితో నెరవైన జంటలే

(||pallavi||)
ūragunnām̐ bonīdu vuḍivoni javvanamu
tārugāṇa livi nīgu dām̐gavachchunaḍare

(||ūra||)
kanusūbulu som̐kide kalayigalu rem̐sunu
manasu lĕnasidenu marmamu laṁṭu
sĕnagulu veḍugaide sesina sem̐talu sĕllu
pĕnaside nŏṁdŏgaḍi pĕnulaṁkĕle

(||ūra||)
yĕḍamām̐ṭalu viṁṭene hĕchchum̐ daridībulu
baḍivāyaguṁḍidem̐ jŏppam̐ḍu jĕlimi
vŏḍam̐bāḍu galigide nŏnagūḍum̐ gām̐giḽḽu
taḍaya kŏṁḍŏgaḍigim̐ dagulāyame

(||ūra||)
navvulagu lonaide nāmu lĕkku valabulu
vuvviḽḽūram̐ bĕnam̐gide nubbiṁchu menu
ivvala śhrīveṁkaḍeśhum̐ ḍinniḍānu ninnu nelĕ
nivvaḍilla nŏṁḍŏṁṭido nĕravaina jaṁṭale