Ooragunnaabenu neeve vokkokkade remsidivi

ఊరకున్నాపెను నీవే వొక్కొక్కటే రేఁచితివి
Language

(॥పల్లవి॥)
ఊరకున్నాపెను నీవే వొక్కొక్కటే రేఁచితివి
తారుకాణ మా మాఁట తలఁచుకో యిఁకను

(॥ఊర॥)
మగువలు మాఁటాడితే మట్టున నిలుచునా
తుగలుక వుల్లములు దాఁకుఁగాక
నగదొరకొంటేను నడుమ నిలుచునా
చిగురు చేఁగలు సేసి సిగ్గు రేఁచుఁగాక

(॥ఊర॥)
కొచ్చి చూడదొరకొంటే కొద్ది వెట్టవచ్చునా
నచ్చుకొట్టి మర్మాలెల్లా నాఁటుఁగాక
అచ్చలానఁ జే చాఁచితే నంతట నిలుచునా
పెచ్చువెరిఁగి వలపు పెద్దసేసుఁగాక

(॥ఊర॥)
మేను సోఁకఁ బెనఁగితే మితి మేరలున్నవా
సోన చెమటలు గారఁ జొక్కించుగాఁక
ఆనుక శ్రీవేంకటేశ యలమేల్మంగ పతివి
తానకమై యీకె పొందు తలఁపించుఁగాక

(||pallavi||)
ūragunnābĕnu nīve vŏkkŏkkaḍe rem̐sidivi
tārugāṇa mā mām̐ṭa talam̐sugo yim̐kanu

(||ūra||)
maguvalu mām̐ṭāḍide maṭṭuna nilusunā
tugaluga vullamulu dām̐kum̐gāga
nagadŏragŏṁṭenu naḍuma nilusunā
siguru sem̐galu sesi siggu rem̐sum̐gāga

(||ūra||)
kŏchchi sūḍadŏragŏṁṭe kŏddi vĕṭṭavachchunā
nachchugŏṭṭi marmālĕllā nām̐ṭum̐gāga
achchalānam̐ je sām̐side naṁtaḍa nilusunā
pĕchchuvĕrim̐gi valabu pĕddasesum̐gāga

(||ūra||)
menu som̐kam̐ bĕnam̐gide midi meralunnavā
sona sĕmaḍalu gāram̐ jŏkkiṁchugām̐ka
ānuga śhrīveṁkaḍeśha yalamelmaṁga padivi
tānagamai yīgĕ pŏṁdu talam̐piṁchum̐gāga