Ooragunna yaamtadaani nogadaadevu

ఊరకున్న యాఁటదాని నొకటాడేవు
Language

(॥పల్లవి॥)
ఊరకున్న యాఁటదాని నొకటాడేవు
మేర మీరేనా నిన్ను మెరయించెఁగాక

(॥ఊర॥)
రామలతో నీసుద్దులు రాఁపుగాఁ జెప్పెనా యింతి
బూము లెరఁగఁగ నిన్నుఁ బొగడెఁగాక
చేముట్టి నీమేన నిండాఁ జేఁతలెల్లాఁజేసెనా
సాములు నేరుతువని జరసెఁగాక

(॥ఊర॥)
కినిసి నీపైఁ జెలి కేరడము నెరపెనా
ననుపు చేసుక కొంత నవ్వెఁగాక
యెనలేక నిన్నుఁ గడు యెంగిలి సేసెనా నేఁడు
చనవున మోవితేనె చవిచూపెఁగాక

(॥ఊర॥)
అలమేలుమంగ నిను నలమటఁ బెట్టెనా
సొలపులరతి నీకుఁ జూపెఁగాక
యెలమి శ్రీ వేంకటేశ యీపె గోర నూఁదెనా
కళలనేర్పులు నీకుఁ దెలిపెఁగాక

(||pallavi||)
ūragunna yām̐ṭadāni nŏgaḍāḍevu
mera mīrenā ninnu mĕrayiṁchĕm̐gāga

(||ūra||)
rāmalado nīsuddulu rām̐pugām̐ jĕppĕnā yiṁti
būmu lĕram̐gam̐ga ninnum̐ bŏgaḍĕm̐gāga
semuṭṭi nīmena niṁḍām̐ jem̐talĕllām̐jesĕnā
sāmulu neruduvani jarasĕm̐gāga

(||ūra||)
kinisi nībaim̐ jĕli keraḍamu nĕrabĕnā
nanubu sesuga kŏṁta navvĕm̐gāga
yĕnalega ninnum̐ gaḍu yĕṁgili sesĕnā nem̐ḍu
sanavuna movidenĕ savisūbĕm̐gāga

(||ūra||)
alamelumaṁga ninu nalamaḍam̐ bĕṭṭĕnā
sŏlabularadi nīgum̐ jūbĕm̐gāga
yĕlami śhrī veṁkaḍeśha yībĕ gora nūm̐dĕnā
kaḽalanerbulu nīgum̐ dĕlibĕm̐gāga