ఊరకున్న వారినేల వొకటొక టడిగేవు
(॥పల్లవి॥)
ఊరకున్న వారినేల వొకటొక టడిగేవు
చేరి నీదూతికలు చెప్పేరుగాక
(॥॥)
పనివడి నీతో మాటపలు కాడుదుముగాక
యెనలేని నీపొందు లెరుఁగుదుమా
చనవున నీసేవలు సారెకుఁ జేసేము యిఁక
మనసులోనిమర్మాలు మాకుఁ దెలుసునా
(॥॥)
బంతినుండి నీకు నేము పాదాలొత్తుదుముగాక
వింత నీవలపులెల్లా విచారించేమా
చెంతనుండి నీమీఁద సేసలు చల్లేముగాక
వంతు నీచుట్టరికాలు వాఁసుకొనేమాది
(॥॥)
వొట్టి రాణివాసాలమై వొద్దనే వుందుముగాక
దిట్టనీగుణములెల్ల దిద్దవచ్చేమా
అట్టె శ్రీవేంకటేశ అలమేల్మంగపతివి
యెట్టయినా నీరతులు యెంచుకోవచ్చేమా
(||pallavi||)
ūragunna vārinela vŏgaḍŏga ṭaḍigevu
seri nīdūdigalu sĕpperugāga
(||||)
panivaḍi nīdo māḍabalu kāḍudumugāga
yĕnaleni nībŏṁdu lĕrum̐gudumā
sanavuna nīsevalu sārĕgum̐ jesemu yim̐ka
manasulonimarmālu māgum̐ dĕlusunā
(||||)
baṁtinuṁḍi nīgu nemu pādālŏttudumugāga
viṁta nīvalabulĕllā visāriṁchemā
sĕṁtanuṁḍi nīmīm̐da sesalu sallemugāga
vaṁtu nīsuṭṭarigālu vām̐sugŏnemādi
(||||)
vŏṭṭi rāṇivāsālamai vŏddane vuṁdumugāga
diṭṭanīguṇamulĕlla diddavachchemā
aṭṭĕ śhrīveṁkaḍeśha alamelmaṁgabadivi
yĕṭṭayinā nīradulu yĕṁchugovachchemā