Ooragunna vaarigela vudugulu gattevu

ఊరకున్న వారికేల వుడుకులు గట్టేవు
Language

(॥పల్లవి॥)
ఊరకున్న వారికేల వుడుకులు గట్టేవు
నేరుపు లాడనే చూపు నే వెరతు నిందుకు

(॥ఊర॥)
సేయవయ్య నీవు నీచేతికి లోనైనట్టెల్ల
ఆయములు సోఁకగ నీ వాపె వొద్దనే
మాయవల పొకచోట మన్నన నీకొకచోట
వోయయ్య పచరించేవు వోప నోప నేను

(॥ఊర॥)
నగవయ్య నీవు వోయి నాఁటిన ప్రియముతోడ
అగపడి నీతో నవ్వే ఆపె తోడనే
జిగి నుప్పమ్మఁ గొందరు చిట్లు మోయఁ గొందురు-
నగునీతో సరస మరగదు మాకును

(॥ఊర॥)
చెప్పవయ్య నీవు నేనుఁ జేకొని కూడిన సుద్ది
అప్పసము యెమ్మెలకు నాపెతోడను
యిప్పుడె శ్రీవేంకటేశ యీడఁ గొంత నాడఁ గొంతఁ
నప్పటిఁ దిరిగాడితే నది నేను మెచ్చను

(||pallavi||)
ūragunna vārigela vuḍugulu gaṭṭevu
nerubu lāḍane sūbu ne vĕradu niṁdugu

(||ūra||)
seyavayya nīvu nīsedigi lonainaṭṭĕlla
āyamulu som̐kaga nī vābĕ vŏddane
māyavala pŏgasoḍa mannana nīgŏgasoḍa
voyayya pasariṁchevu voba noba nenu

(||ūra||)
nagavayya nīvu voyi nām̐ṭina priyamudoḍa
agabaḍi nīdo navve ābĕ toḍane
jigi nuppammam̐ gŏṁdaru siṭlu moyam̐ gŏṁduru-
nagunīdo sarasa maragadu māgunu

(||ūra||)
sĕppavayya nīvu nenum̐ jegŏni kūḍina suddi
appasamu yĕmmĕlagu nābĕdoḍanu
yippuḍĕ śhrīveṁkaḍeśha yīḍam̐ gŏṁta nāḍam̐ gŏṁtam̐
nappaḍim̐ dirigāḍide nadi nenu mĕchchanu