Ooragunna vaaridoda vooru noba deṟamgavaa

ఊరకున్న వారితోడ వూరు నోప దెఱఁగవా
Language

(॥పల్లవి॥)
ఊరకున్న వారితోడ వూరు నోప దెఱఁగవా
చేరి నాతో సుద్దులెల్లాఁ జెప్పేవుగాక

(॥ఊర॥)
వద్దని నీతో నేను వాదులడిచేనా
గద్దించి యప్పటి నిన్నుఁ గాదనేనా
తిద్ది నీగుణాలు నేఁడు తీరుచవచ్చేనా
వొద్దనే నీ వెట్టుండినా నుండివిగాక

(॥ఊర॥)
చలపట్టి నిను నేను సాదించవచ్చేనా
కలవి లేనివి తారుకాణించేనా
నిలువుకునిలువే నిన్ను నేరాలెంచేనా
వెలి నెంతనవ్వినా నవ్వితివిగాక

(॥ఊర॥)
పంతమాడి సారె సారెఁ బంగించదొరకొనేనా
వంతులకు నంతేసి వాసిపట్టేనా
యింతలో శ్రీవేంకటేశ యెనసితి విటు నన్ను
యెంత చనవిచ్చినాను ఇచ్చేవుగాక

(||pallavi||)
ūragunna vāridoḍa vūru noba dĕṟam̐gavā
seri nādo suddulĕllām̐ jĕppevugāga

(||ūra||)
vaddani nīdo nenu vādulaḍisenā
gaddiṁchi yappaḍi ninnum̐ gādanenā
tiddi nīguṇālu nem̐ḍu tīrusavachchenā
vŏddane nī vĕṭṭuṁḍinā nuṁḍivigāga

(||ūra||)
salabaṭṭi ninu nenu sādiṁchavachchenā
kalavi lenivi tārugāṇiṁchenā
niluvuguniluve ninnu nerālĕṁchenā
vĕli nĕṁtanavvinā navvidivigāga

(||ūra||)
paṁtamāḍi sārĕ sārĕm̐ baṁgiṁchadŏragŏnenā
vaṁtulagu naṁtesi vāsibaṭṭenā
yiṁtalo śhrīveṁkaḍeśha yĕnasidi viḍu nannu
yĕṁta sanavichchinānu ichchevugāga