ఊరకున్న వారి కూరోపదన్నట్లు
(॥పల్లవి॥)
ఊరకున్న వారి కూరోపదన్నట్లు
నేరనైతి నే నింక నిన్నేల కొసర
(॥॥)
మగిడి చూడఁగఁదా మనసు నీపైఁ దగిలె
తగులు గలుగఁగదా దైవారె వలపు
నగుతానే ఇంతాయ నావంకనే నేఁడు
ఇగిరించెఁ గోర్కి నీవేమి సేతువురా
(॥॥)
మాటలాడఁగఁగదా మర్మములు గడునాటె
నాటుఁదమకము గదా నమఁ బాయనీదు
తేటతెల్లమి సేసె తెగనినాయాసలే
వాటపుఁదప్పు నీవల్ల నిఁకనేదీ
(॥॥)
మెకమోటమునఁగదా మొలచె నివ్వెర గొకటి
వొకటి కొకటికి లంకె లమరె మన కిపుడు
వెకలినై కూడితిని వింతగా నిను నేను
అకట శ్రీవేంకటేశ అనఁగఁ జోటేది
(||pallavi||)
ūragunna vāri kūrobadannaṭlu
neranaidi ne niṁka ninnela kŏsara
(||||)
magiḍi sūḍam̐gam̐dā manasu nībaim̐ dagilĕ
tagulu galugam̐gadā daivārĕ valabu
nagudāne iṁtāya nāvaṁkane nem̐ḍu
igiriṁchĕm̐ gorgi nīvemi seduvurā
(||||)
māḍalāḍam̐gam̐gadā marmamulu gaḍunāḍĕ
nāḍum̐damagamu gadā namam̐ bāyanīdu
teḍadĕllami sesĕ tĕganināyāsale
vāḍabum̐dappu nīvalla nim̐kanedī
(||||)
mĕgamoḍamunam̐gadā mŏlasĕ nivvĕra gŏgaḍi
vŏgaḍi kŏgaḍigi laṁkĕ lamarĕ mana kibuḍu
vĕgalinai kūḍidini viṁtagā ninu nenu
agaḍa śhrīveṁkaḍeśha anam̐gam̐ joḍedi