ఊరకున్న సతి నిఁక నొరసి అడుగవద్దు
(॥పల్లవి॥)
ఊరకున్న సతి నిఁక నొరసి అడుగవద్దు
వూరడించి సంతోసాన నొలలార్చవలెను
(॥ఊర॥)
వుప్పతించరాక మొగమాట గలవారికి
తప్పులెంచఁ బనిలేదు తమ పతిని
చిప్పిలఁగఁ బ్రియము చెప్పేటివారికి
యెప్పుడూ నలుగరాదు యేమి చేసినాను
(॥ఊర॥)
గట్టిగాఁ జుట్టరికము గలిగినవారికి
ఱట్టు సేయఁగఁ దగదు అట్టె పతిని
యిట్టె మనసు మర్మము లెరిఁగినవారికి
వట్టినేరా లెంచవద్దు వసము గాకున్నాను
(॥ఊర॥)
యిచ్చకము నెరుపేటి యితవైనవారికి
పచ్చిసేసి దూరరాదు ప్రాణనాధుని
యిచ్చల శ్రీవేంకటేశ యేలితి వీకాంతను
కొచ్చి కొసరఁగవద్దు గుట్టుతోనున్నాను
(||pallavi||)
ūragunna sadi nim̐ka nŏrasi aḍugavaddu
vūraḍiṁchi saṁtosāna nŏlalārsavalĕnu
(||ūra||)
vuppadiṁcharāga mŏgamāḍa galavārigi
tappulĕṁcham̐ baniledu tama padini
sippilam̐gam̐ briyamu sĕppeḍivārigi
yĕppuḍū nalugarādu yemi sesinānu
(||ūra||)
gaṭṭigām̐ juṭṭarigamu galiginavārigi
ṟaṭṭu seyam̐gam̐ dagadu aṭṭĕ padini
yiṭṭĕ manasu marmamu lĕrim̐ginavārigi
vaṭṭinerā lĕṁchavaddu vasamu gāgunnānu
(||ūra||)
yichchagamu nĕrubeḍi yidavainavārigi
pachchisesi dūrarādu prāṇanādhuni
yichchala śhrīveṁkaḍeśha yelidi vīgāṁtanu
kŏchchi kŏsaram̐gavaddu guṭṭudonunnānu