Ooragunna nannu nela vudigimcha vachchevu

ఊరకున్న నన్ను నేల వుడికించ వచ్చేవు
Language

(॥పల్లవి॥)
ఊరకున్న నన్ను నేల వుడికించ వచ్చేవు
చేరి నీకు యెంత పగ సేసితినో కాని

(॥ఊర॥)
కొంగు వట్టి తియ్యకుర కూచున్న దాని నన్ను
వుంగిటే నే రా నోప నొళ్లు నొచ్చీని
యింగితాన నన్నుఁ జూచి యించుకంత దయ లేవు
సంగడి నే నెంత పాపజాతినో కాని

(॥ఊర॥)
బలిమి శాయకురా పలుకఁగ నోప నీతో
లలి నామనసు వొకలా గయ్యీని
తలఁపు నీ వెరిఁగియు తతిగొని పోరేవు
యెలమి నే నేఁటిజన్న మెత్తితినో కాని

(॥ఊర॥)
కాఁగిలించి పట్టకురా కమ్మటి యిట్టె పొంది
వీగి నిన్నుఁ బాయ నోప వేస టయ్యీని
దాఁగక శ్రీవెంకటేశ తగ నన్నుఁ గూడితిని
రాఁగి యెంత భాగ్యవంతురాలనో కాని

(||pallavi||)
ūragunna nannu nela vuḍigiṁcha vachchevu
seri nīgu yĕṁta paga sesidino kāni

(||ūra||)
kŏṁgu vaṭṭi tiyyagura kūsunna dāni nannu
vuṁgiḍe ne rā noba nŏḽlu nŏchchīni
yiṁgidāna nannum̐ jūsi yiṁchugaṁta daya levu
saṁgaḍi ne nĕṁta pābajādino kāni

(||ūra||)
balimi śhāyagurā palugam̐ga noba nīdo
lali nāmanasu vŏgalā gayyīni
talam̐pu nī vĕrim̐giyu tadigŏni porevu
yĕlami ne nem̐ṭijanna mĕttidino kāni

(||ūra||)
kām̐giliṁchi paṭṭagurā kammaḍi yiṭṭĕ pŏṁdi
vīgi ninnum̐ bāya noba vesa ṭayyīni
dām̐gaga śhrīvĕṁkaḍeśha taga nannum̐ gūḍidini
rām̐gi yĕṁta bhāgyavaṁturālano kāni