ఊరకుంటే నెరఁగవు వూరివారి యెదుటనే
(॥పల్లవి॥)
ఊరకుంటే నెరఁగవు వూరివారి యెదుటనే
బీరములే నెరపేవు పెద్దరికమౌరా
(॥ఊర॥)
కూరిమి గొసరి నిన్నుఁ గోపగించినంతలోనే
మేరమీరి తిట్టేవు మేలురా నీవు
వారి వీరితోడ నీవాదులు చెప్పఁగఁ బోతే
సారెనొత్తుక వచ్చేవు జాణవు నీవౌదురా
(॥ఊర॥)
సరసమాడేటివేళ చనుమొనలనొత్తితే
అరిది గోరనూఁదేవు అవురా నీవు
సరుగ వద్దివారిని సాకిరి వెట్టఁగఁబోతే
గరిమెఁ బగచాటేవు కానీరా నీవు
(॥ఊర॥)
కానిమ్మని నీచేఁతలు కడుఁ జెల్లఁబెట్టితేను
మేనరికమే పెంచేవు మెస్తిరా నిన్ను
యీనెపాన శ్రీవేంకటేశ నన్నుఁ గూడితివి
నానాఁడే నీగుణాలకు నవ్వితిరా నేను
(||pallavi||)
ūraguṁṭe nĕram̐gavu vūrivāri yĕduḍane
bīramule nĕrabevu pĕddarigamaurā
(||ūra||)
kūrimi gŏsari ninnum̐ gobagiṁchinaṁtalone
meramīri tiṭṭevu melurā nīvu
vāri vīridoḍa nīvādulu sĕppam̐gam̐ bode
sārĕnŏttuga vachchevu jāṇavu nīvaudurā
(||ūra||)
sarasamāḍeḍiveḽa sanumŏnalanŏttide
aridi goranūm̐devu avurā nīvu
saruga vaddivārini sāgiri vĕṭṭam̐gam̐bode
garimĕm̐ bagasāḍevu kānīrā nīvu
(||ūra||)
kānimmani nīsem̐talu kaḍum̐ jĕllam̐bĕṭṭidenu
menarigame pĕṁchevu mĕstirā ninnu
yīnĕbāna śhrīveṁkaḍeśha nannum̐ gūḍidivi
nānām̐ḍe nīguṇālagu navvidirā nenu