ఊరకుంటే నెఱఁగవు వొకటొకటాడేవు
(॥పల్లవి॥)
ఊరకుంటే నెఱఁగవు వొకటొకటాడేవు
నేరుపుల మా బీరాలు నీవే యెఱుఁగవా
(॥ఊర॥)
చలము సాదించఁగాక చక్కెరనీ మోవియెల్ల
వులివచ్చి సేయనా వొక్కమాఁటే
బలిమి చూపఁగాక పంతపునీమేనెల్ల
కులికి నాకుచముల కుమ్మెలుగాఁ జేయనా
(॥ఊర॥)
బతిమి చెరుచఁగాక భ్రమయించి నీమనసు
వ్రతము వట్టించనా వలపులను
మితిమీఱఁగాక నీమిక్కు టపురతులలో
తతిగొని పాదమునఁ దాటించి నవ్వంచనా
(॥ఊర॥)
పంగించఁగాక నిన్ను పైకొని కూడి ఇప్పడు
యెంగిలిగాఁ జేయనా ఇన్నిటా నేఁడు
అంగవించి శ్రీవేంకటాధిప నన్నేలితివి
సంగతి నాచెమటల జలకమాడించనా
(||pallavi||)
ūraguṁṭe nĕṟam̐gavu vŏgaḍŏgaḍāḍevu
nerubula mā bīrālu nīve yĕṟum̐gavā
(||ūra||)
salamu sādiṁcham̐gāga sakkĕranī moviyĕlla
vulivachchi seyanā vŏkkamām̐ṭe
balimi sūbam̐gāga paṁtabunīmenĕlla
kuligi nāgusamula kummĕlugām̐ jeyanā
(||ūra||)
badimi sĕrusam̐gāga bhramayiṁchi nīmanasu
vradamu vaṭṭiṁchanā valabulanu
midimīṟam̐gāga nīmikku ṭaburadulalo
tadigŏni pādamunam̐ dāḍiṁchi navvaṁchanā
(||ūra||)
paṁgiṁcham̐gāga ninnu paigŏni kūḍi ippaḍu
yĕṁgiligām̐ jeyanā inniḍā nem̐ḍu
aṁgaviṁchi śhrīveṁkaḍādhiba nannelidivi
saṁgadi nāsĕmaḍala jalagamāḍiṁchanā