Ooragumdumanave vuvidalaala vibhuni

ఊరకుండుమనవే వువిదలాల విభుని
Language

(॥పల్లవి॥)
ఊరకుండుమనవే వువిదలాల విభుని
నేరనివాఁడా తాను నేనే యెఱుఁగుదునే

(॥ఊర॥)
చిగురుఁజేతులఁ గావా చేవకొనగోళ్లున్నవి
మొగిచి యందులకేల మొక్కీనే నాకు
మొగమోటమునఁ గాదా మునుకొనె వలపులు
నగవులు నగి యేల నయాలు చూపీనే

(॥ఊర॥)
మాఁటలలోనే కావా మర్మములెల్లా నుండేవి
మాఁటపట్టు సారె నేల మరీ నిచ్చీనే
గాఁటపుఁజూపులఁ గావా కంతునివాఁడిములెల్లా
ఆఁటదాన నాపైనేల అల్లార్చి చూచీనే

(॥ఊర॥)
చిక్కనిసిగ్గులే కావి చిత్తములఁ గరఁచేవి
పెక్కుమారు లవియేల పెడరేఁచీనే
ఇక్కువ శ్రీవేంకటేశుఁ డిన్నిటాను నన్నుఁ గూడె
వక్కణతో నివి యేల వర్ణించీనే

(||pallavi||)
ūraguṁḍumanave vuvidalāla vibhuni
neranivām̐ḍā tānu nene yĕṟum̐gudune

(||ūra||)
sigurum̐jedulam̐ gāvā sevagŏnagoḽlunnavi
mŏgisi yaṁdulagela mŏkkīne nāgu
mŏgamoḍamunam̐ gādā munugŏnĕ valabulu
nagavulu nagi yela nayālu sūbīne

(||ūra||)
mām̐ṭalalone kāvā marmamulĕllā nuṁḍevi
mām̐ṭabaṭṭu sārĕ nela marī nichchīne
gām̐ṭabum̐jūbulam̐ gāvā kaṁtunivām̐ḍimulĕllā
ām̐ṭadāna nābainela allārsi sūsīne

(||ūra||)
sikkanisiggule kāvi sittamulam̐ garam̐sevi
pĕkkumāru laviyela pĕḍarem̐sīne
ikkuva śhrīveṁkaḍeśhum̐ ḍinniḍānu nannum̐ gūḍĕ
vakkaṇado nivi yela varṇiṁchīne