Ooragumdumanave voddu voddu vegiramu

ఊరకుండుమనవే వొద్దు వొద్దు వేగిరము
Language

(॥పల్లవి॥)
ఊరకుండుమనవే వొద్దు వొద్దు వేగిరము
పేరఁబెట్టుకొంటి నింతే ప్రియమైన వలపు

(॥ఊర॥)
తా నాకు మేలువాఁడు తనకు నే మేలుదాన
ఆనలు వెట్టఁగనేఁటి కందిరలోన
నే నెఱఁగనా తననిజము లన్నియును
నానఁబెట్టుకొంటి నింతే నవ్వులకు వలవు

(॥ఊర॥)
సేసవెట్టినాడు తాను చేఇ వట్టి పెండ్లాడితి
బాసలు సేయఁగనేలే పలుమారును
అసపడ్డదాన నేను అన్నిటా జాణ తాను
రాసిచేసుకొంటి నింతే రవ్వయినవలపు

(॥ఊర॥)
అట్టె శ్రీవేంకటేశుఁడల డలమేలుమంగ నేను
పట్టి పెనఁగఁగనేలే పంతము లిచ్చి
నెట్టన తా నన్నుఁ గూడె నే మెవ్వరందు లేదు
గట్టిసేసుకొంటి నింతే కందువైనవలపు

(||pallavi||)
ūraguṁḍumanave vŏddu vŏddu vegiramu
peram̐bĕṭṭugŏṁṭi niṁte priyamaina valabu

(||ūra||)
tā nāgu meluvām̐ḍu tanagu ne meludāna
ānalu vĕṭṭam̐ganem̐ṭi kaṁdiralona
ne nĕṟam̐ganā tananijamu lanniyunu
nānam̐bĕṭṭugŏṁṭi niṁte navvulagu valavu

(||ūra||)
sesavĕṭṭināḍu tānu sei vaṭṭi pĕṁḍlāḍidi
bāsalu seyam̐ganele palumārunu
asabaḍḍadāna nenu anniḍā jāṇa tānu
rāsisesugŏṁṭi niṁte ravvayinavalabu

(||ūra||)
aṭṭĕ śhrīveṁkaḍeśhum̐ḍala ḍalamelumaṁga nenu
paṭṭi pĕnam̐gam̐ganele paṁtamu lichchi
nĕṭṭana tā nannum̐ gūḍĕ ne mĕvvaraṁdu ledu
gaṭṭisesugŏṁṭi niṁte kaṁduvainavalabu