Ooragumdude naagu vusida meemela; gaaga

ఊరకుండుటే నాకు వుచిత మీమేళ; గాక
Language

(॥పల్లవి॥)
ఊరకుండుటే నాకు వుచిత మీమేళ; గాక
యీరసాన సారె సారె యెట్టు సాదించేను

(॥ఊర॥)
కపటాన ఇంతులఁ గలసినవాఁడవు
నెపములు చెప్పఁగనేరవా నీవు
కపురై నీమోమున కళలునిండుకుండఁగ
అపరాధాలు నిన్ను నేమనియెంచేను

(॥ఊర॥)
వలచి కాముకుఁడవైవచ్చినట్టివాఁడవు
మలసి ఆనవెట్టకమానేవానీవు
మెలుపుమచ్చెములు నీమేన నిండివుండఁగ
తలమోచి యెన్నెన్ని తప్పులు పట్టేను

(॥ఊర॥)
గరిమఁ గాఁగిట నన్నుఁగలసినవాఁడవు
నిరతమై ఇన్నిటామన్నించవా నీవు
తెరలి శ్రీవేంకటేశ దిష్టమై నీవుండఁగ
కురులంటేనీయం దెట్టు కొఱత లెంచేను

(||pallavi||)
ūraguṁḍuḍe nāgu vusida mīmeḽa; gāga
yīrasāna sārĕ sārĕ yĕṭṭu sādiṁchenu

(||ūra||)
kabaḍāna iṁtulam̐ galasinavām̐ḍavu
nĕbamulu sĕppam̐ganeravā nīvu
kaburai nīmomuna kaḽaluniṁḍuguṁḍam̐ga
abarādhālu ninnu nemaniyĕṁchenu

(||ūra||)
valasi kāmugum̐ḍavaivachchinaṭṭivām̐ḍavu
malasi ānavĕṭṭagamānevānīvu
mĕlubumachchĕmulu nīmena niṁḍivuṁḍam̐ga
talamosi yĕnnĕnni tappulu paṭṭenu

(||ūra||)
garimam̐ gām̐giḍa nannum̐galasinavām̐ḍavu
niradamai inniḍāmanniṁchavā nīvu
tĕrali śhrīveṁkaḍeśha diṣhṭamai nīvuṁḍam̐ga
kurulaṁṭenīyaṁ dĕṭṭu kŏṟada lĕṁchenu