ఊరకుండు చాలుఁజాలు వొరలోనఁ బెట్టు మిఁక
(॥పల్లవి॥)
ఊరకుండు చాలుఁజాలు వొరలోనఁ బెట్టు మిఁక
సారపు నీ వినయాలు సతములయ్యానా
(॥ఊర॥)
పయ్యదేల పుడికేవు పంతములేల ఇచ్చేవు
తియ్యనినీమాటలెల్లఁ దెలిసె నాకు
చెయ్యార నీవు నాకు సేసినబాసలే చాలు
వెయ్యయినా నీవినయాలు వీనులఁబట్టీనా
(॥ఊర॥)
కన్నులనేల మొక్కేవు కడునేల నవ్వేవు
తిన్ననివలపెల్లాఁ దెలిసె నాకు
చిన్ననాఁడు నామీఁద సేసవెట్టినదే చాలు
యెన్నైనా వొడఁబాటు లితవయ్యీనా
(॥ఊర॥)
బలిమేల సేసేవు పైకొని యేల మెచ్చేవు
తిలకించ నీమేలు తెలిసె నాకు
యెలమి శ్రీవేంకటేశ యిట్టె నన్నుఁ గూడితివి
అలరి యెఁతైనా నీపై యాసమానీనా
(||pallavi||)
ūraguṁḍu sālum̐jālu vŏralonam̐ bĕṭṭu mim̐ka
sārabu nī vinayālu sadamulayyānā
(||ūra||)
payyadela puḍigevu paṁtamulela ichchevu
tiyyaninīmāḍalĕllam̐ dĕlisĕ nāgu
sĕyyāra nīvu nāgu sesinabāsale sālu
vĕyyayinā nīvinayālu vīnulam̐baṭṭīnā
(||ūra||)
kannulanela mŏkkevu kaḍunela navvevu
tinnanivalabĕllām̐ dĕlisĕ nāgu
sinnanām̐ḍu nāmīm̐da sesavĕṭṭinade sālu
yĕnnainā vŏḍam̐bāḍu lidavayyīnā
(||ūra||)
balimela sesevu paigŏni yela mĕchchevu
tilagiṁcha nīmelu tĕlisĕ nāgu
yĕlami śhrīveṁkaḍeśha yiṭṭĕ nannum̐ gūḍidivi
alari yĕm̐tainā nībai yāsamānīnā