ఊరకుండు చాలుఁ జాలు వోప నింతేసిపనికి
(॥పల్లవి॥)
ఊరకుండు చాలుఁ జాలు వోప నింతేసిపనికి
కూరిమి నీ కొసరు లీకోమలు లెరఁగరా
(॥ఊర॥)
చల్లనినీళ్ళే కావా జలజలఁ బారేవి
మెల్లనిమాటలే కావా చిల్లులయ్యేవి
మల్లాడి నాతోఁ బెనఁగి మంచితనాలు చూపేవు
వెల్లవిరి నీసుద్దు లీవెలఁదులెరఁగరా
(॥ఊర॥)
కప్పుర మించుక గాదా కన్నులఁ బదనయ్యేది
రెప్పల చూపులే కావా రేసు రేఁచేవి
ముప్పిరి నా కిటువచ్చి మోవితేనె లొసగేవు
వొప్పుగా నెలయింత లీవువిద లెరఁగరా
(॥ఊర॥)
చిగురిప్పటిదె కాదా చేగలు మీర నయ్యేది
పగటు నవ్వులే కావా వచ్చి సేసేవి
అగపడి శ్రీ వేంకటాధిప నన్నేలితివి
తగవరి మన్నన లీతరుణు లెరఁగరా
(||pallavi||)
ūraguṁḍu sālum̐ jālu voba niṁtesibanigi
kūrimi nī kŏsaru līgomalu lĕram̐garā
(||ūra||)
sallaninīḽḽe kāvā jalajalam̐ bārevi
mĕllanimāḍale kāvā sillulayyevi
mallāḍi nādom̐ bĕnam̐gi maṁchidanālu sūbevu
vĕllaviri nīsuddu līvĕlam̐dulĕram̐garā
(||ūra||)
kappura miṁchuga gādā kannulam̐ badanayyedi
rĕppala sūbule kāvā resu rem̐sevi
muppiri nā kiḍuvachchi movidenĕ lŏsagevu
vŏppugā nĕlayiṁta līvuvida lĕram̐garā
(||ūra||)
sigurippaḍidĕ kādā segalu mīra nayyedi
pagaḍu navvule kāvā vachchi sesevi
agabaḍi śhrī veṁkaḍādhiba nannelidivi
tagavari mannana līdaruṇu lĕram̐garā