ఊరకుండితేఁ గనక వుడివోవు పాయము
(॥పల్లవి॥)
ఊరకుండితేఁ గనక వుడివోవు పాయము
దూరి బుద్ది చెప్పి పతిఁ దోడి తేఁగదరే
(॥ఊర॥)
బడి వాయకుండితేనే భావమలు గరఁగును
వొడలు సోఁకితేఁ దమి పుట్టిపడును
నిడువక చూచితేనే వేడుకలు పెచ్చురేఁగు
చిడుముడి మాఁటాడితే సిగ్గు గొంత దేరును
(॥ఊర॥)
సెలవుల నవ్వితేనే చేఁగలించు మోహము
పిలిచి పేరుకొంటేనే ప్రియము పుట్టు
వలపులు చల్లితేనే వాడికలు దైవారు
చెలిమి సారెఁజేసితే చేతికి లోనౌను
(॥ఊర॥)
సరసము లాడఁగానే చవులు వెగ్గళమవును
గరిమలఁ బెనఁగితే కళలు నిండు
యిరవై శ్రీవేంకటేశుఁ డింతలోనె నన్నుఁ గూడె
తిరమై వుండితే మోమితేనెకు నోరూరును
(||pallavi||)
ūraguṁḍidem̐ ganaga vuḍivovu pāyamu
dūri buddi sĕppi padim̐ doḍi tem̐gadare
(||ūra||)
baḍi vāyaguṁḍidene bhāvamalu garam̐gunu
vŏḍalu som̐kidem̐ dami puṭṭibaḍunu
niḍuvaga sūsidene veḍugalu pĕchchurem̐gu
siḍumuḍi mām̐ṭāḍide siggu gŏṁta derunu
(||ūra||)
sĕlavula navvidene sem̐galiṁchu mohamu
pilisi perugŏṁṭene priyamu puṭṭu
valabulu sallidene vāḍigalu daivāru
sĕlimi sārĕm̐jeside sedigi lonaunu
(||ūra||)
sarasamu lāḍam̐gāne savulu vĕggaḽamavunu
garimalam̐ bĕnam̐gide kaḽalu niṁḍu
yiravai śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalonĕ nannum̐ gūḍĕ
tiramai vuṁḍide momidenĕgu norūrunu