Ooragumdide neṟamga(?) vottuga vachchevu neevu

ఊరకుండితే నెఱఁగ(?) వొత్తుక వచ్చేవు నీవు
Language

(॥పల్లవి॥)
ఊరకుండితే నెఱఁగ(?) వొత్తుక వచ్చేవు నీవు
యేరా యింతటిలోనే యెమ్మెలాడేవు

(॥॥)
సిగ్గువడరాదా నీవు చేయి మీఁద వేయఁగాను
యెగ్గుపట్టరాదా నేను యేమైనా నాడఁగాను
అగ్గలము నవ్వరాదా ఆయము లిట్టే యంటఁగా
కగ్గి యిందరిలో నేల కాకుసేసేవు

(॥॥)
తలవంచుకొనరాదా తమకించి పైకొనఁగా
పులకించరాదా నీవు పొందులెల్లాఁ జూపఁగాను
కళలతో మించరాదా కప్పురముపైఁ జల్లఁగా
చెలులకింతలో ననుఁ జేత జూపేవు

(॥॥)
నివ్వెరఁగు నొందరాదా నీవు కాఁగిలించఁగాను
జవ్వనాన వీఁగరాదా సమరతులఁ గూడఁగా
వువ్విళ్ళూర మొక్కరాదా వొక్కటై బుజ్జగించఁగా
రవ్వగా శ్రీవేంకటేశ రాఁపేల సేసేవు

(||pallavi||)
ūraguṁḍide nĕṟam̐ga(?) vŏttuga vachchevu nīvu
yerā yiṁtaḍilone yĕmmĕlāḍevu

(||||)
sigguvaḍarādā nīvu seyi mīm̐da veyam̐gānu
yĕggubaṭṭarādā nenu yemainā nāḍam̐gānu
aggalamu navvarādā āyamu liṭṭe yaṁṭam̐gā
kaggi yiṁdarilo nela kāgusesevu

(||||)
talavaṁchugŏnarādā tamagiṁchi paigŏnam̐gā
pulagiṁcharādā nīvu pŏṁdulĕllām̐ jūbam̐gānu
kaḽalado miṁcharādā kappuramubaim̐ jallam̐gā
sĕlulagiṁtalo nanum̐ jeda jūbevu

(||||)
nivvĕram̐gu nŏṁdarādā nīvu kām̐giliṁcham̐gānu
javvanāna vīm̐garādā samaradulam̐ gūḍam̐gā
vuvviḽḽūra mŏkkarādā vŏkkaḍai bujjagiṁcham̐gā
ravvagā śhrīveṁkaḍeśha rām̐pela sesevu