ఊరకుండేవో లేదో వోసి చెంచెతా । వోరి
(॥పల్లవి॥)
ఊరకుండేవో లేదో వోసి చెంచెతా । వోరి
కోరి నిన్ను నెంచుకొంటి గొల్లఁడవు గదరా
(॥॥)
జమళిపీకిలిదండ సరి నీకేలే
నెమలిచుంగులపాగా నీకేలేరా
అమరెనే సంకుఁగడె ముందుకుఁ దోడు
భ్రమసి నీవేల గుల్ల పట్టుకున్నాఁడవురా
(॥॥)
పలుమెకాలవెంటను పారేవేలే! నీవు
యెలమిఁ బులుగునేల యెక్కితివిరా
పలచని పారెటాకు పయ్యదేఁటికే
అల మఱ్ఱేకుపానుపు అది నీకు నేలరా
(॥॥)
కాకిపైఁడిబొట్టు నీకుఁ గడుప్రియమా
ఆకుఁ దొలసిదండ నీకది బాఁతొ
కైకొంటి శ్రీ వేంకటాద్రిఘనుఁడ నిన్ను-
నేకమైతిఁ గదరా నీయిందిరాదేవిని
(||pallavi||)
ūraguṁḍevo ledo vosi sĕṁchĕdā | vori
kori ninnu nĕṁchugŏṁṭi gŏllam̐ḍavu gadarā
(||||)
jamaḽibīgilidaṁḍa sari nīgele
nĕmalisuṁgulabāgā nīgelerā
amarĕne saṁkum̐gaḍĕ muṁdugum̐ doḍu
bhramasi nīvela gulla paṭṭugunnām̐ḍavurā
(||||)
palumĕgālavĕṁṭanu pārevele! nīvu
yĕlamim̐ bulugunela yĕkkidivirā
palasani pārĕḍāgu payyadem̐ṭige
ala maṭregubānubu adi nīgu nelarā
(||||)
kāgibaim̐ḍibŏṭṭu nīgum̐ gaḍupriyamā
āgum̐ dŏlasidaṁḍa nīgadi bām̐tŏ
kaigŏṁṭi śhrī veṁkaḍādrighanum̐ḍa ninnu-
negamaidim̐ gadarā nīyiṁdirādevini