ఊరకుండవయ్యా నీవు వువిదతో మారాడక
(॥పల్లవి॥)
ఊరకుండవయ్యా నీవు వువిదతో మారాడక
ఆరయ నొచ్చము లేదు అంగనల కెపుడు
(॥ఊర॥)
యే మాడిన నాఁటదాని కెగ్గులేదు తప్పు లేదు
నేమాన నూరకుండిన నేరమి లేదు
దోమటిగాఁ జూచినాను దొరతన మై తోఁచు
వేమారు నవ్విన నవి వేడుకలై నిలుచు
(॥ఊర॥)
తల వంచుకుండినాను తగ్గు లేదు మొగ్గు లేదు
పలుకక వుండినాను భయము లేదు
బలుములై చూపినాను పంతము లై రతి కెక్కు
పెలుచుఁజేత సేసినా ప్రియము లై తగులు
(॥ఊర॥)
మించి కాఁగిటఁ గూడిన మితి లేదు మేర లేదు
యించుక గుట్టున నున్న యెరవె లేదు
అంచల శ్రీవెంకటేశ అంగనఁ గూడితి విట్టె
మంచముపైఁ గూచుండిన మర్మము లై మించును
(||pallavi||)
ūraguṁḍavayyā nīvu vuvidado mārāḍaga
āraya nŏchchamu ledu aṁganala kĕbuḍu
(||ūra||)
ye māḍina nām̐ṭadāni kĕgguledu tappu ledu
nemāna nūraguṁḍina nerami ledu
domaḍigām̐ jūsinānu dŏradana mai tom̐su
vemāru navvina navi veḍugalai nilusu
(||ūra||)
tala vaṁchuguṁḍinānu taggu ledu mŏggu ledu
palugaga vuṁḍinānu bhayamu ledu
balumulai sūbinānu paṁtamu lai radi kĕkku
pĕlusum̐jeda sesinā priyamu lai tagulu
(||ūra||)
miṁchi kām̐giḍam̐ gūḍina midi ledu mera ledu
yiṁchuga guṭṭuna nunna yĕravĕ ledu
aṁchala śhrīvĕṁkaḍeśha aṁganam̐ gūḍidi viṭṭĕ
maṁchamubaim̐ gūsuṁḍina marmamu lai miṁchunu