(॥పల్లవి॥)
ఊరకుండవయ్య చాలు నోయయ్య
నేరుపరి వౌదువయ్య నే వెఱతునయ్యా
(॥ఊర॥)
అయ్య నీకు దండమయ్య అంతకు నేనోపనయ్య
పయ్యద ముట్టకువయ్య పచ్చిగానయ్యా
గయ్యాళి నేనౌదునయ్య కల్లలాడేవా అయ్య
దయ్య మెరిఁగితేఁ జాలు దాని కేమయ్యా
(॥ఊర॥)
బల్లిదుఁడ వౌదువయ్య పలుమాట లేలయ్య
చెల్లునయ్య నీవుసేసేచేఁతలునయ్యా
అల్లనాఁడె కంటిమయ్య అందరును సాకిరయ్య
మల్లడి నీగుణమయ్య మంచి దౌనౌనయ్యా
(॥ఊర॥)
అనలింకానేలయ్య అట్టె తనిసితినయ్య
కానికాని వొట్లేల కానీవయ్య
మేనంటి శ్రీవేంకటేశ మెప్పించి కూడితివయ్యా
మోనాన నుండేవయ్య మోవు నా కీవయ్య
(||pallavi||)
ūraguṁḍavayya sālu noyayya
nerubari vauduvayya ne vĕṟadunayyā
(||ūra||)
ayya nīgu daṁḍamayya aṁtagu nenobanayya
payyada muṭṭaguvayya pachchigānayyā
gayyāḽi nenaudunayya kallalāḍevā ayya
dayya mĕrim̐gidem̐ jālu dāni kemayyā
(||ūra||)
ballidum̐ḍa vauduvayya palumāḍa lelayya
sĕllunayya nīvusesesem̐talunayyā
allanām̐ḍĕ kaṁṭimayya aṁdarunu sāgirayya
mallaḍi nīguṇamayya maṁchi daunaunayyā
(||ūra||)
analiṁkānelayya aṭṭĕ tanisidinayya
kānigāni vŏṭlela kānīvayya
menaṁṭi śhrīveṁkaḍeśha mĕppiṁchi kūḍidivayyā
monāna nuṁḍevayya movu nā kīvayya