ఊరకుండవయ్య నాకు నొక్క మనసాయ
(॥పల్లవి॥)
ఊరకుండవయ్య నాకు నొక్క మనసాయ
ధీరత నీగుణము సోదించినదే కాదా
(॥॥)
దతి నాకేమైనా చుట్టముగాదా తొల్లి
యెదిరించి మాటాడితే నేమాయను
వుదుటున నన్ను నెంచ వొడఁ బరచవచ్చేవు
కదిసి నీమనసు నేఁ గన్నదేకాదా
(॥॥)
పొలఁతి యెప్పుడు నీపొరుగింటిదే కాదా
యెలమి నిక్కిచూచితే నేమాయను
కలగొన నిందుకేల కారణాలు దెలిపేవు
వెలయఁ గ నీసుద్ది నే విన్నదే కాదా
(॥॥)
వనిత నీ కెప్పుడును వావి నీవదినే గాదా
యెనసి సేసవెట్టితే నేమాయను
ననుపై శ్రీ వేంకటేశ నన్ను నమ్మించి కూడితి
చెనకి నీవోజ తెలిసినదే కాదా
(||pallavi||)
ūraguṁḍavayya nāgu nŏkka manasāya
dhīrada nīguṇamu sodiṁchinade kādā
(||||)
dadi nāgemainā suṭṭamugādā tŏlli
yĕdiriṁchi māḍāḍide nemāyanu
vuduḍuna nannu nĕṁcha vŏḍam̐ barasavachchevu
kadisi nīmanasu nem̐ gannadegādā
(||||)
pŏlam̐ti yĕppuḍu nībŏrugiṁṭide kādā
yĕlami nikkisūside nemāyanu
kalagŏna niṁdugela kāraṇālu dĕlibevu
vĕlayam̐ ga nīsuddi ne vinnade kādā
(||||)
vanida nī kĕppuḍunu vāvi nīvadine gādā
yĕnasi sesavĕṭṭide nemāyanu
nanubai śhrī veṁkaḍeśha nannu nammiṁchi kūḍidi
sĕnagi nīvoja tĕlisinade kādā